మోహన్‌బాబుకి ఎంజీఆర్‌ డాక్టరేట్‌

Mohan Babu is an MGR doctorate

మోహన్‌బాబు... నటుడు మాత్రమే కాదు. కులమతాలకు అతీతంగా తమ విద్యానికేతన్‌ విద్యాసంస్థల్లో 25 శాతం విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు. సమాజానికి, సినిమాలకు ఆయన చేస్తున్న సేవను గుర్తించిన భారత ప్రభుత్వం 2007లో ‘పద్మ శ్రీ’తో సత్కరించింది. అమెరికాలోని ‘యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా’తో పాటు పలు సంస్థలు ఆయన్ను గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. తాజాగా ఆయన కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరనుంది.

చెన్నైలో ప్రసిద్ధి చెందిన ‘ఎంజీఆర్‌ యూనివర్శిటీ’ వారు మోహన్‌బాబుకు గౌరవ డాక్టరేట్‌ ప్రధానం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నెల 4న చెన్నైలో ఈ డాక్టరేట్‌ ప్రదానోత్సవం జరగనుంది. సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం మోహన్‌బాబు ‘గాయత్రి’లో నటిస్తున్నారు.

Back to Top