హీరో.. విలన్.. రెండూ అతనే..! | Mohan Babu Is The Hero And The Villain in gayathri | Sakshi
Sakshi News home page

Dec 24 2017 10:22 AM | Updated on Dec 24 2017 10:22 AM

Mohan Babu Is The Hero And The Villain in gayathri - Sakshi

సీనియర్ హీరో మోహన్ బాబు చాలా కాలం తరువాత లీడ్ రోల్‌లో ఓ సినిమా చేస్తున్నారు. గాయత్రి అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోహన్ బాబు హీరోగా నటిస్తున్నారు. తండ్రీ కూతుళ్ల మధ్య జరిగే కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మంచు విష్ణు అతిథి పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమాలో మోహన్ బాబు ద‍్విపాత్రాభినయం చేస్తున్నారట. ఈ సినిమాలో మోహన్ బాబు హీరోగానే కాదు విలన్ గానూ కనిపించనున్నారట. విలన్ గానే ఇండస్ట్రీకి పరిచయం అయిన మోహన్ బాబు ఇటీవల కాలం ప్రతీనాయక పాత్రల్లో కనిపించలేదు. శ్రియ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను ఫిబ్రవరి 9న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement