సీనియర్ నటుడు జాఫ్రీ మృతికి సంతాపం | Modi expresses 'deepest condolences' on Saeed Jaffrey's demise | Sakshi
Sakshi News home page

సీనియర్ నటుడు జాఫ్రీ మృతికి సంతాపం

Nov 16 2015 4:09 PM | Updated on Sep 3 2017 12:34 PM

సీనియర్ నటుడు జాఫ్రీ మృతికి సంతాపం

సీనియర్ నటుడు జాఫ్రీ మృతికి సంతాపం

భారత సంతతికి చెందిన బ్రిటీష్ సీనియర్ నటుడు సయిద్ జాఫ్రీ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు.

న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన బ్రిటీష్ సీనియర్ నటుడు సయిద్ జాఫ్రీ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. బహుముఖ ప్రజ్ఞతో ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారని సంతాప సందేశంలో మోదీ పేర్కొన్నారు.

86 ఏళ్ల సయిద్ జాఫ్రీ వృద్ధాప్య సమస్యలతో ఆదివారం ఆయన కన్నుమూశారు. మసూమ్, గాంధీ, రామ్ తేరీ గంగా మైలీ, హెన్నా తదితర సినిమాల్లో ఆయన నటించారు. తన సహనటి మెహ్రునిమా(మాధుర్ జాఫ్రీ)ని ఆయన పెళ్లాడారు. 1965లో వీరు విడిపోయారు. వీరికి ముగ్గురు కుమార్తెలు మీరా, జియా, సకినా ఉన్నారు.

తన అసమాన నటనతో సయిద్ జాఫ్రీ పలు అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. నాటక రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక 'ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్' గౌరవ పురస్కారం ప్రదానం చేశారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement