బాలయ్య సినిమాలో క్యాలెండర్ గర్ల్ | model Kyra Dutt in Balakrishna, Puri Jagannath movie | Sakshi
Sakshi News home page

బాలయ్య సినిమాలో క్యాలెండర్ గర్ల్

May 30 2017 1:32 PM | Updated on Mar 22 2019 1:53 PM

బాలయ్య సినిమాలో క్యాలెండర్ గర్ల్ - Sakshi

బాలయ్య సినిమాలో క్యాలెండర్ గర్ల్

బాలీవుడ్ దర్శకుడు మథుర్ బండార్కర్ తెరకెక్కించిన క్యాలెండర్ గర్ల్స్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన హాట్ బ్యూటి కైరా

బాలీవుడ్ దర్శకుడు మథుర్ బండార్కర్ తెరకెక్కించిన క్యాలెండర్ గర్ల్స్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన హాట్ బ్యూటి కైరా దత్. తెలుగులో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన రేసుగుర్రం సినిమాలో బూచాడే బూచాడే సాంగ్లో మెరిసిన ఈ బ్యూటీ మరోసారి టాలీవుడ్ ఆడియన్స్ను పలకరించనుంది. ఏక్తా కపూర్ నిర్మిస్తున్న త్రిపులెక్స్ సినిమా కోసం నగ్నంగా నటించేందుకు అగ్రిమెంట్ చేసుకొని సంచలనం సృష్టించిన ఈ బ్యూటీ కోలీవుడ్ లోనూ ఐటమ్ సాంగ్స్తో హవా చూపిస్తోంది.

అవకాశాల కోసం దర్శకుడు పూరి జగన్నాథ్, హీరోయిన్ చార్మీలు ఏర్పాటు చేసిన పూరి కనెక్ట్స్ను ఆశ్రయించిన కైరా, ఆ సంస్థ ద్వారా పూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలయ్య సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం పోర్చుగల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తోంది కైరా దత్. బాలకృష్ణ డాన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో శ్రియ లీడ్ హీరోయిన్గా నటిస్తుండగా మరికొందరు మోడల్స్ సందడి చేయనున్నారన్న ప్రచారం జరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement