ఎమ్మెల్యే వినోదం

MLA movie press meet  - Sakshi

‘లక్ష్మీ కళ్యాణం’ సినిమా విడుదలైన పదకొండేళ్లకు కల్యాణ్‌ రామ్, కాజల్‌ అగర్వాల్‌ కలిసి నటించిన చిత్రం ‘ఎంఎల్‌ఎ’. ‘మంచి లక్షణాలున్న అబ్బాయ్‌’ అన్నది ఉపశీర్షిక. ఉపేంద్ర మాధవ్‌ దర్శకత్వంలో బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మా బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేశ్‌ ప్రొడక్షన్స్‌ అసోసియేషన్‌లో గతేడాది విడుదలైన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా పెద్ద సక్సెస్‌ సాధించింది. పీపుల్‌ మీడియా అసోసియేషన్‌లో చేసిన ‘ఎంఎల్‌ఎ’ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యాయి.

ఈరోజు సెన్సార్‌ కార్యక్రమాలు జరగనున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల 23న సినిమా విడుదల చేస్తాం. మా బ్యానర్‌లో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ కంటే ‘ఎంఎల్‌ఎ’ ఇంకా పెద్ద హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘టైటిల్‌ని చూసి ఇది రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా అనుకోవద్దు. పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉంటుంది. తొలిభాగం కార్పొరేట్‌ నేపథ్యంలో, రెండో భాగం రూరల్‌ నేపథ్యంలో సాగుతుంది. నాకు ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, కల్యాణ్‌రామ్‌గారికి థ్యాంక్స్‌’’ అన్నారు ఉపేంద్ర మాధవ్‌. చిత్రసమర్పకులు విశ్వప్రసాద్, సహ నిర్మాత వివేక్‌ కూచిభొట్ల పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ.
∙కల్యాణ్‌ రామ్, కాజల్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top