హనీ ఈజ్‌ క్యూట్‌

Mehrene Kaur Pirzada Chit Chat With Sakshi

అందుకే సినిమాల్లోకి వచ్చా  

13 ఏళ్లకే ‘మిస్‌ పర్సనాలిటీ సౌత్‌ ఏసియా’ టైటిల్‌ సాధించా

‘సాక్షి’తో మెహ్రీన్‌ కౌర్‌ ముచ్చట్లు

సినిమా హీరోయిన్‌ కావాలనేది నా డ్రీమ్‌. స్కూల్‌ డేస్‌లోనే ఈ నిర్ణయం తీసుకున్నా. 13 ఏళ్లకే కెనడాలో ‘మిస్‌ పర్సనాలిటీ సౌత్‌ ఏషియా’ టైటిల్‌ను సాధించా. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ ద్వారా మూవీల్లోకి ఎంట్రీ ఇచ్చా. ఎఫ్‌–2 నా ఫేవరెట్‌ సినిమా.  టాలీవుడ్‌ నాకు తల్లి. ఈ తల్లిని విడిచిపెట్టి బయటకు పోయేది లేదు. ట్రావెలింగ్‌ నాకు అత్యంత ఇష్టం. తిరుమలకు కాలినడకన వెళ్లడం అద్భుతమైన ఫీల్‌...– హీరోయిన్‌ మెహ్రీన్‌

క్లాస్‌లో టీచర్‌ విద్యార్థులను ఒక్కొక్కరినీ వారివారి గోల్స్‌ ఏంటో చెప్పమన్నారు.. ఒకరు తాను డాక్టర్‌ అవుతానంది. ఇంకొరు పైలెట్‌ అన్నారు.. మరొకరు లాయర్‌.. తర్వాత మరో విద్యార్థి ఐఏఎస్‌.. ఇంకా ఐపీఎస్‌.. చార్టెడ్‌ అకౌంటెంట్‌.. బిజినెస్‌.. ఇలా ఎవరి లక్ష్యాలు వారు చెప్పారు. ఓ విద్యార్థిని మాత్రం ఇవన్నీ అవుతానని సమాధానం చెప్పడంతో టీచర్‌ సైతం ఖంగుతిన్నారు. అదెలా సాధ్యమంటే ‘సినిమా హీరోయిన్‌’ అయితే అవన్నీ సాధ్యమేనని చెప్పిందా పిల్ల. ఈ గడసరి సమాధానం చెప్పిన ఆ గడుగ్గాయి.. ‘హనీ ఈజ్‌ ద బెస్ట్‌’ అంటూ ‘ఎఫ్‌ 2’ చిత్రంలో అల్లరి చేసిన ‘మెహరీన్‌ కౌర్‌ పిర్జాదా’. తన అందాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు 13 ఏళ్ల వయసులోనే అందాల పోటీల్లో పాల్గొన్న పంజాబీ చిన్నది మరెన్నో విశేషాలను ‘సాక్షి’తో పంచుకుంది.    – చైతన్య వంపుగాని

13 ఏళ్లకే టైటిల్‌ సాధించా..
మాది పంజాబ్‌లోని భటిండా ప్రాంతం. హీరోయిన్‌ కావాలని చిన్నప్పటి నుంచి ఉంది. ఆరేళ్ల వయసులో ‘మిస్‌ యూనివర్స్‌’ అవ్వాలని కలగన్నాను. 13 ఏళ్లకే కెనడాలో ‘మిస్‌ పర్సనాలిటీ సౌత్‌ ఏసియా’ టైటిల్‌ను సాధించా. ఇదే సమయంలో డవ్, పియర్స్, నికాన్, థమ్స్‌ అప్‌ వంటి యాడ్స్‌లో నటించా. ఉద్యోగం కోసం 12 తరగతి పూర్తయ్యాక యూఎస్‌కి వెళ్లాను. యూఎస్‌లో జాబ్‌ చేస్తూ యాక్టింగ్, మోడలింగ్‌పై దృష్టి సారించాను. అమెరికా కంటే ముంబై బెస్ట్‌ అని తిరిగి వచ్చేశా. ముంబైలో ఓ ఇనిస్టిట్యూట్‌లో చేరి యాక్టింగ్‌ నేర్చుకున్నా. 2016లో ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడు తెలుగు సినిమాలు, రెండు తమిళం, ఓ హిందీ చిత్రంలో నటించాను. నా ఫస్ట్‌ సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ సినిమా, ‘ఎఫ్‌ 2’ అంటే బాగా ఇష్టం. మొదటి సినిమాలో ‘మహాలక్ష్మి’ రౌడీ క్యారెక్టర్‌ బాగా నచ్చింది. ఎందుకంటే చిన్నతనంలో నేను అలాగే ఉండేదాన్ని. ‘ఎఫ్‌ 2’లో హనీ క్యారెక్టర్‌ చిన్నపిల్లలకు బాగా కనెక్ట్‌ అయింది. ‘హానీ ఈజ్‌ ద బెస్ట్‌’ అంటూ చిన్న పిల్లలు వీడియో షూట్‌ చేసి ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేస్తూ నన్ను ట్యాగ్‌ చేస్తున్నారు. అవి చూసి చాలా హ్యాపీగా ఫీలవుతున్నా.

తన స్టాఫ్‌తో మెహ్రీన్‌
ఐ యామ్‌ ఎ ట్రావెలర్‌
షూటింగ్‌ నుంచి తీరిక దొరికితే ట్రావెల్‌ చేస్తుంటా. నాకు ట్రావెలింగ్‌ అంటే చాలా ఇష్టం. ఎక్కువగా నా తమ్ముడు ‘గుర్ఫతే సింగ్‌ పిర్జాదే’(బాలీవుడ్‌ యాక్టర్‌)తో కలసి వెళ్తుంటా. తమ్ముడుకి ఖాళీ లేకపోతే అమ్మతోనో, ఫ్రెండ్స్‌తోనో వెళ్తుంటా. ట్రెక్కింగ్‌ అంటే కూడా ఇష్టం. యూఎస్, యూరఫ్‌ సిటీస్‌ అంటే చాలా ఇష్టం. ఆస్ట్రేలియా వెళ్లాలని ఉంది. నా మేనేజర్‌ మహేందర్‌ పర్మిషన్‌ ఇస్తే అక్కడకు వెళ్లి ఏదైనా హాలీడే సెలబ్రేట్‌ చేసుకోవాలని ఉంది(నవ్వుతూ). నేను టెన్త్‌ చదివుతున్నప్పుడు ఓ రోజు ఫ్రెండ్స్‌తో కలసి ఒక మాల్‌కి వెళ్లాను. ఆ టైంలో ఒక అబ్బాయి నాకు తెలియకుండా, నా పర్మిషన్‌ లేకుండా తన మొబైల్‌ ఫోన్‌లో ఫొటోలు తీశాడు. వెంటనే సెక్యురిటీ వాళ్లకు సమచారం ఇచ్చా. దగ్గరకు వెళ్లి మొబైల్‌ చూపించమన్నా. తను చూపించకపోవడంతో ఒక్క లెంపకాయ కొట్టి అతని షర్ట్‌ కాలర్‌ పట్టుకున్నా. వెంటనే ఫోన్‌ తీసుకుని అవన్నీ డిలీట్‌ చేసేశా. మొబైల్‌ ఫోన్‌ అంటే మాట్లాడటం, మెసేజ్‌లు చేసుకోవడానికి వాడతారు. నేను సాంగ్స్‌ కోసం నా ఫోన్‌ని వాడుతుంటా. ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ అన్నీ నేనే నేరుగా చూస్తుంటా. నాకు ఇంతవరకు కాస్టింగ్‌ కౌచ్‌ సమస్య ఎదురవలేదు. అందుకు కారణం నాకు మంచి స్టాఫ్‌ ఉన్నారు. ఇండస్ట్రీలోని డైరెక్టర్స్, ప్రొడ్యూసర్లు అందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు. హైదరాబాద్‌ అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. ఫస్ట్‌ సినిమాకు ఇక్కడకు వచ్చినప్పుడు రంజాన్‌ రోజులు.. అమ్మ, స్టాఫ్‌తో కలసి రెండు మూడుసార్లు చార్మినర్‌ చూడ్డానికి వెళ్లాను. ఇక పెళ్లంటారా.. దేవుడు ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడే.  

తెలుగులో నేను అన్ని మంచి సినిమాలుచేయగలిగానంటే కారణం తెలుగుప్రేక్షకులే. నాకు మొదటి సినిమాతోనే ఓ రేంజ్, క్రేజ్‌ని ఇచ్చారు. ఇంత ఆప్యాయత చూపిస్తున్న ప్రేక్షకులను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. టాలీవుడ్‌ నాకు తల్లి.ఈ తల్లిని విడిచిపెట్టి బయటకు పోయేది లేదు.

నాకులవ్‌ప్రపోజ్‌చేసేధైర్యంఎవరూచేయలేదు.కారణం స్కూల్,కాలేజీడేస్‌లో టామ్‌బాయ్‌గా ఉండేదాన్ని. అందువల్ల అబ్బాయిలుమాట్లాడాలంటేనేభయపడేవారు. స్కూల్లో టీచర్‌ మీరేంఅవుతారనుకుంటున్నారని అడిగినప్పుడు హీరోయిన్‌ నా టార్గెట్‌ అని చెప్పాను.

తిరుమల కాలినడకన వెళ్లా..
సల్మాన్‌ఖాన్‌కి పెద్ద ఫ్యాన్‌ని. ఆయనతో సినిమా చేయాలన్నది నా డ్రీమ్‌. తెలుగులో సమంత యాక్టింగ్‌కి ఫిదా, బాలీవుడ్‌లో కాజల్‌కి పెద్ద ఫ్యాన్‌ని. టాలీవుడ్‌లో అందరి హీరోలతో యాక్ట్‌ చేయాలనుంది. రాజమౌళి దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలి.. ఖచ్చితంగా చేస్తా. ఎఫ్‌ 2లో నా యాక్టింగ్‌ బాగుందని విజయశాంతి కాంప్లిమెంట్‌ ఇచ్చారంట. ఆమెను నేరుగా కలిసి థ్యాంక్స్‌ చెప్పాలి. ‘హలో’ హీరోయిన్‌ ‘కళ్యాణి ప్రియదర్శిని’ నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌. ఎక్కువగా టచ్‌లో ఉంటాం. స్కూల్లో ఎన్‌సీసీ స్టూడెంట్‌ని. తిరుమల శ్రీవారిని దర్శనానికి కాలి నడకన వెళ్లాను, చాలా హ్యాపీగా ఉంది. త్వరలో తెలుగులో గోపీచంద్, నాగశౌర్య, కళ్యాణ్‌రామ్‌తో కనిపిస్తా. తమిళంలో ధనుష్‌తో ఓ చిత్రం చేస్తున్నా. రెండు పంజాబీ, ఓ కన్నడ సినిమాలు కూడా ఉన్నాయి.. అంటూ ముగిచింది మెహ్రీన్‌.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top