
నితిన్ తరువాత చైతూతో..!
నితిన్ హీరోగా తెరకెక్కిన లై సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన బ్యూటీ మేఘా ఆకాష్.
నితిన్ హీరోగా తెరకెక్కిన లై సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన బ్యూటీ మేఘా ఆకాష్. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ భామకు ఆ సినిమా రిజల్ట్ మాత్రం నిరాశకలిగించింది. అయితే లై సినిమాలో లుక్స్, నటనతో ఆకట్టుకున్న మేఘా ఆకాష్ కు వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇప్పటికే రామ్ హీరోగా తెరకెక్కుతున్న ఉన్నది ఒకటే జిందగీలో హీరోయిన్ గా నటిస్తున్న ఈ భామకు ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ తలుపు తట్టింది.
యుద్ధం శరణం సినిమాతో ఆకట్టుకోలేకపోయిన నాగచైతన్య, వెంటనే తన నెక్ట్స్ సినిమా పనులు ప్రారంభించాడు. త్వరలో పెళ్లి కోసం బ్రేక్ తీసుకునే ఆలోచన ఉన్నా.. ఈలోగానే తన నెక్ట్స్ సినిమాను పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట. మారుతి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఇందుకోసం పూజా హెగ్డే, అను ఇమ్మాన్యూల్ తో పాటు మేఘా ఆకాష్ పేరును కూడా పరిశీలిస్తున్నారట. త్వరలోనే హీరోయిన్ ను ఫైనల్ చేసి సినిమాపై అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు.