
.. అంటూ దూసుకుపోతున్నారు హీరోయిన్ మేఘా ఆకాశ్. నితిన్ సరసన నటించిన ‘లై, ఛల్ మోహన రంగా’ అనుకున్న ఫలితాన్ని సాధించనప్పటికీ క్రేజీ ఆఫర్స్‌తో దూసుకెళ్తున్నారు. ఇప్పుడు ఏకంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాలో యాక్ట్ చేసే లక్కీ చాన్స్ కొట్టేశారీ బ్యూటీ. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే.
సన్ నెట్‌వర్క్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. విజయ్ సేతుపతి, బాబీ సింహా, సనంత్ రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా మేఘా ఆకాశ్‌ను ఓ కీలక పాత్రకు తీసుకున్నారు. మేఘ నటించిన రెండు తమిళ చిత్రాలు ‘ఒరు పక్క కతై, ఎన్నై నోక్కి పాయుమ్ తొట్టా’ రిలీజ్ కాకముందే సూపర్ స్టార్ సినిమాలో అవకాశం రావడమంటే నిజంగా లక్కీనే కదా. పైగా ఇందులో మంచి పాత్ర