నాణ్యతకే ప్రాధాన్యమివ్వండి

నాణ్యతకే ప్రాధాన్యమివ్వండి - Sakshi


తెరపైనా, తెరవెనుక ఎంతో అందంగా, సంప్రదాయబద్ధంగా, ముద్దుముద్దుగా, అల్లరిగా, సొగసుగా ఉండే బాలీవుడ్ అందాలసుందరి అలియాభట్... నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేసేందుకే మొగ్గుచూపాలని యువతకు సలహాలిస్తోంది. ‘కాస్మెటిక్ ఉత్పత్తులను కొనుగోలు చేసే సమయంలో నాణ్యతకే మొగ్గుచూపాలి. బ్రాండెడ్ కంపెనీల ఉత్పత్తులు నాణ్యత కలిగిఉంటాయి. నాణ్యత విషయంలో ఎవరుకూడా ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడకూడదు. ముఖ్యంగా చర్మసౌందర్యానికి సంబంధించి లేదా మేకప్‌కు సంబంధించిన ఉత్పత్తుల విషయంలో జాగ్రత్త వహించాలి’ అని హితవు పలికింది. తాను వినియోగించే వ స్తువులు లేదా ఉత్పత్తుల విషయంలో అలియా అత్యంత జాగ్రత్త వహిస్తుంది. తన వెంట ఉండే బ్యాగ్‌లో అందానికి మెరుగులు దిద్దుకునేందుకు ఉపయోగించే ఉత్పత్తులు కనీసం ఐదు లేదా ఆరింటిని ఉంచుకుంటుంది.

 

 మేబిలైన్ బేబీ లిప్స్‌లిప్ బామ్, పెర్ఫ్యూమ్, క్రీమ్, కోహల్, మై హెయిర్ బ్రష్‌లను నిరంతరం ఈ అందాల భామ అందుబాటులో ఉంచుకుంటుంది. గూగుల్ హ్యాంగవుట్‌ద్వారా గత నెల 21వ తేదీన ఈ ముద్దుగుమ్మ ఆన్‌లైన్‌లో అనేకమందికి బ్యూటీ టిప్‌లు చెప్పింది. సందేశాలు పంపింది. అంతేకాకుండా వీడియో చాటింగ్‌కూడా చేసింది. గార్నియర్ ఫ్రుక్టిస్ అనే హెయిర్‌కేర్ ఉత్పత్తుల సంస్థకు అలియా... బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. దీంతోపాటు ఎంటీవీ డిజిటల్ షో ‘ఫిలిప్స్ ఎంటీవీ ది లుక్’ అనే కార్యక్రమంద్వారా కేశసంరక్షణ గురించి ప్రేక్షకులకు సలహాలు, సూచనలు అందిస్తోంది. కేశాలను కాపాడుకోవడం ద్వారా అందంగా ఎలా కనిపించగలుగుతామనే విషయాన్ని చక్కగా వివరిస్తోంది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top