నాకూ బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడు..!

Me Also Have Boyfriend Says Nikki Galrani - Sakshi

తనకు బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడు అని చెప్పింది నటి నిక్కీగల్రాణి. ఆ మధ్య మంచి సక్సెస్‌లతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం కాస్త వెనుక పడిందనే చెప్పాలి. బాలనటిగా రంగప్రవేశం చేసిన ఈ కన్నడ బ్యూటీ ఆ తరువాత ఫ్యాషన్‌ డిజైనర్, మోడలింగ్‌ రంగాల్లో రాణించి తద్వారా సినీరంగానికి ఎంట్రీ ఇచ్చింది. అలా మొదట మాలీవుడ్‌లో అవకాశాలు వరించాయి. ఆపై కన్నడ, తమిళ భాషల్లో హీరోయిన్‌గా అవకాశాలను అందుకుంది. ముఖ్యంగా కోలీవుడ్‌లో డార్లింగ్‌ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమై ఆ చిత్ర సక్సెస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా మరగతమణియన్, వేలన్ను వందుట్టా వెళైక్కారన్‌ హింట్‌ చిత్రాల్లో నటించింది. అయితే ఆ తరువాత నటించిన చిత్రాలు వరుసగా ఆశించిన విజయాలను అందుకోకపోవడంతో నిక్కీగల్రాణి మార్కెట్‌ డౌన్‌ అయ్యింది. ఇంకా చెప్పాలంటే కోలీవుడ్‌లో ఒకే ఒక్క చిత్రం చేతిలో ఉంది. మలయాళంలో రెండు చిత్రాల్లో నటిస్తోంది.

కాగా ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈ అమ్మడిని ప్రేమ అనుభవం ఉందా? అని అడగ్గా,  ఓ ఉందే అని టక్కున చెప్పింది. ఎవరతను? పెళ్లెప్పుడూ? అన్న ప్రశ్నలకు నిక్కీగల్రాణి సూటిగానే సమాధానం ఇచ్చింది. ఇంతకీ ఈ బ్యూటీ ఏం చెప్పిందో చూద్దాం. నేనూ ప్రేమలో పడ్డాను. నా లవర్‌ను చెన్నైలోనే కలుసుకున్నాను. అయితే ప్రస్తుతానికి అతనెవరన్నది బయటపెట్టను. మీకో విషయాన్ని బహిరంగంగా చెప్పుతున్నాను. నేను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను. అయితే అందుకు ఇంకా సమయం ఉంది. నేను నటించాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయి. మంచి పాత్రల్లో నటించాలి. మరో మూడేళ్లలో పెళ్లి చేసుకుంటాను అని నిక్కీగల్రాణి చెప్పింది. అయితే మార్కెట్‌ తగ్గడంతోనే ఈ అమ్మడి పెళ్లి సిద్ధం అవుతుందనే టాక్‌ వినిపిస్తోంది. అన్నట్టు నిక్కీగల్రాణికి ఇప్పుడు జస్ట్‌ 27 ఏళ్ల వయస్సే. అంటే మూడు పదుల వయసులో పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగు పెట్టాలనుకుంటుందన్నమాట.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top