భారీ సెట్‌లో సర్దార్ గబ్బర్‌సింగ్ | Massive set for pawan kalyan sardar gabbarsingh shoot | Sakshi
Sakshi News home page

భారీ సెట్‌లో సర్దార్ గబ్బర్‌సింగ్

Jan 5 2016 1:49 PM | Updated on Mar 22 2019 5:33 PM

భారీ సెట్‌లో సర్దార్ గబ్బర్‌సింగ్ - Sakshi

భారీ సెట్‌లో సర్దార్ గబ్బర్‌సింగ్

కొతం కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న పవన్, ఈ సారి అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ సర్దార్ గబ్బర్‌సింగ్ 60 శాతం పూర్తి చేసిన పవన్...

కొతం కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న పవన్, ఈసారి అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ సర్దార్ గబ్బర్సింగ్ 60 శాతం షూటింగ్ పూర్తిచేసిన పవన్, తదుపరి షెడ్యూల్ను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే అవుట్ డోర్ షూట్తో పాటు కొన్ని పాటలను కూడా పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలో ఓ భారీ సెట్లో షూటింగ్కు రెడీ అవుతోంది.

పవన్ సన్నిహితుడు శరత్ మరార్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా కోసం హైదరబాద్ బంజారాహిల్స్లో భారీ సెట్ వేశారు. పవన్ లాంటి స్టార్ హీరోతో అవుట్ డోర్లో షూటింగ్ చేస్తే సమస్యలు తెలెత్తుతాయని భావించిన యూనిట్, సెట్లో చేయటమే కరెక్ట్ అని.. ఓ బజారుతో పాటు భారీ రైల్వే స్టేషన్, ట్రైన్ల సెట్ రూపొందించారు.

దాదాపు 2 కోట్లతో రూపొందించిన ఈ సెట్లో 27 రోజుల పాటు భారీ షెడ్యూల్ను ప్లాన్ చేశారు. పవర్ ఫేం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. మార్చి మూడోవారంలో ఆడియోను, ఏప్రిల్ 11న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

Advertisement
 
Advertisement
Advertisement