మేరీకోమ్ నిజమైన హీరో: భన్సాలీ | Mary Kom is a true hero: Sanjay Leela Bhansali | Sakshi
Sakshi News home page

మేరీకోమ్ నిజమైన హీరో: భన్సాలీ

Oct 4 2014 1:10 PM | Updated on Apr 3 2019 6:23 PM

మేరీకోమ్ నిజమైన హీరో: భన్సాలీ - Sakshi

మేరీకోమ్ నిజమైన హీరో: భన్సాలీ

భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ నిజమైన హీరో అని బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ప్రశంసించారు.

ముంబై: భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ నిజమైన హీరో అని బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ప్రశంసించారు. ఆసియా గేమ్స్లో మేరీ స్వర్ణ పతకం సాధించడం తనకేమీ ఆశ్చర్యం కలిగించలేదని భన్సాలీ అన్నారు.

మేరీ కోమ్ నిజజీవితం ఆధారంగా 'మేరీకోమ్' చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ప్రియాంక చోప్రా టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రానికి భన్సాలీ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఆసియాడ్లో మేరీ స్వర్ణ పతకం సాధించిన నేపథ్యంలో భన్సాలీ స్పందించారు. మేరీ విజయాన్ని తాను ముందే ఊహించానని భన్సాలీ అన్నారు. 'మేరీ విజయం దేశానికి గర్వకారణం. అద్భుత విజయం సాధించిన మేరీకి అభినందనలు. స్వర్ణ పతకంతో భారత్ వెలిగిపోయేలా చేశారు. మేరీకోమ్ చిత్ర నిర్మాణంలో భాగస్వామిని అయినందుకు సంతోషంగా ఉంది' అని భన్సాలీ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement