సస్పెన్స్‌తో మాంజ | Manza with suspense | Sakshi
Sakshi News home page

సస్పెన్స్‌తో మాంజ

Nov 3 2015 10:55 PM | Updated on Nov 6 2018 8:51 PM

సస్పెన్స్‌తో మాంజ - Sakshi

సస్పెన్స్‌తో మాంజ

ముగ్గురు బాల నేరస్థుల జీవితాలను తెరపై ఆవిష్కరించిన హిందీ చిత్రం ‘కిల్ దెమ్ యంగ్’.

ముగ్గురు బాల నేరస్థుల జీవితాలను తెరపై ఆవిష్కరించిన హిందీ చిత్రం ‘కిల్ దెమ్ యంగ్’. బాలీవుడ్ నాయిక ఈషా డియోల్, అవికాగోర్, కిషన్ ఎస్.ఎస్ ముఖ్యపాత్రల్లో ఈ చిత్రం రూపొందింది. కన్నడంలో ‘ఫుట్‌పాట్2’గా విడుదలై హిట్టయిన ఈ చిత్రాన్ని ‘మాంజ’ పేరుతో రాజ్‌కిరణ్ సమర్పణలో గిరిధర్, పద్మజ మామిడిపల్లి తెలుగులో అందిస్తున్నారు.

ఈ చిత్రం పాటల వేడుక సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. సీడిని దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించి నిర్మాత దామోదర్ ప్రసాద్‌కు అందించారు. తమ్మారెడ్డి మాట్లాడుతూ- ‘‘కిషన్ తొమ్మిదో ఏటే ‘ఫుట్‌పాత్’ అనే సినిమా తీసి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించాడు’’ అని గుర్తుచేశారు. ‘‘ఈ చిత్రం ఎమోషనల్, సస్పెన్స్, థ్రిల్లర్. నవంబర్ చివరిలో రిలీజ్’’అని దర్శకుడు కిషన్ చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement