నాలోని నన్ను వెతుక్కుంటా! | Manjima Mohan opens up about her leg surgery | Sakshi
Sakshi News home page

నాలోని నన్ను వెతుక్కుంటా!

Oct 25 2019 6:10 AM | Updated on Oct 25 2019 6:10 AM

Manjima Mohan opens up about her leg surgery - Sakshi

మంజిమా మోహన్‌

దాదాపు మూడేళ్ల క్రితం ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమయ్యారు మంజిమా మోహన్‌. ఆ తర్వాత ‘యన్‌టీఆర్‌: కథానాయకుడు, మహానాయకుడు’ చిత్రాల్లో కనిపించారీ మలయాళీ బ్యూటీ. తెలుగులో కెరీర్‌ కాస్త స్లోగా ఉన్నప్పటికీ తమిళంలో ఫుల్‌ జోష్‌గా సినిమాలు చేస్తున్నారామె. అయితే మంజిమా కాలికి గాయం కావడంతో ఆ జోష్‌కు బ్రేక్‌ పడింది. ‘‘రెండు వారాల క్రితం నా జీవితంలో ఓ ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ కారణంగా రాబోయే నెల రోజులు నేను బెడ్‌కే పరిమితమవ్వాల్సి వస్తోంది. నాకు ఇష్టమైన నటనకు కొంత సమయం దూరంగా ఉండాల్సి రావడం బాధగా ఉంది. కానీ నాలోని  నన్ను వెతుక్కోవడానికి ఇదొక మంచి అవకాశంగా భావిస్తున్నా. ఇంతకుముందు మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఏంటి? అని ఎవరైనా నన్ను అడిగినప్పుడు ‘ఏమీ లేవు’ అని చెప్పేదాన్ని. ఇకపై ఆ ప్రశ్నకు సమాధానం మార్చి, ఈ పరిస్థితుల గురించి చెబుతాను’’ అని పేర్కొన్నారు మంజిమ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement