సంజయ్‌ దత్‌ తల్లి నర్గిస్‌గా... | Manisha Koirala to play Nargis’ role in Sanjay Dutt biopic | Sakshi
Sakshi News home page

సంజయ్‌ దత్‌ తల్లి నర్గిస్‌గా...

Feb 8 2017 11:56 PM | Updated on Sep 5 2017 3:14 AM

సంజయ్‌ దత్‌ తల్లి నర్గిస్‌గా...

సంజయ్‌ దత్‌ తల్లి నర్గిస్‌గా...

అలనాటి ప్రముఖ నటి, హీరో సంజయ్‌దత్‌ తల్లి నర్గిస్, హీరోయిన్‌ మనీషా కొయిరాల మధ్య ఓ సారూప్యం ఉంది. అదేంటంటే... ఇద్దరూ క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులే.

అలనాటి ప్రముఖ నటి, హీరో సంజయ్‌దత్‌ తల్లి నర్గిస్, హీరోయిన్‌ మనీషా కొయిరాల మధ్య ఓ సారూప్యం ఉంది. అదేంటంటే... ఇద్దరూ క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులే. 51 ఏళ్ల వయసులో క్యాన్సర్‌ కారణంగా నర్గిస్‌ మరణించారు. క్యాన్సర్‌ని జయించిన మనీషా మళ్లీ మేకప్‌ వేసుకుంటున్నారు. బాలీవుడ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో తన టాలెంట్‌ చూపించడానికి సరైన ఛాన్స్‌ కోసం ఎదురు చూస్తున్నారామె. ఈ తరుణంలో మనీషాకి నర్గిస్‌ పాత్రలో నటించే ఛాన్స్‌ లభించింది. సంజయ్‌దత్‌ జీవితం ఆధారంగా రాజ్‌కుమార్‌ హిరాణి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

రణబీర్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్న ఈ బయోపిక్‌లో సంజయ్‌ తల్లి నర్గిస్‌ పాత్రకి మనీషాని ఎంపిక చేశారు. ‘‘మనీషాని ఎంపిక చేయడానికి ముఖ్య కారణం ఆమె క్యాన్సర్‌ను జయించడమే. ఆ బాధను ఆమె స్వయంగా అనుభవించారు’’ అన్నారు దర్శకుడు. జనవరి 17న ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. సంజయ్‌ పాత్ర కోసం రణబీర్‌ 13కిలోలు బరువు పెరిగారు. ఇందులో సంజయ్‌ తండ్రి సునీల్‌దత్‌ పాత్రలో పరేశ్‌ రావల్, సతీమణి మాన్యత పాత్రలో దియా మీర్జా, మాజీ ప్రేయసిగా సోనమ్‌ కపూర్, స్నేహితుడిగా విక్కీ కౌశల్, జర్నలిస్ట్‌గా అనుష్కా శర్మ నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement