టార్చర్‌ కాదు... ఛాలెంజ్‌! | Maniratnam Karthi Cheliya film release on 07th april | Sakshi
Sakshi News home page

టార్చర్‌ కాదు... ఛాలెంజ్‌!

Apr 4 2017 12:15 AM | Updated on Sep 5 2017 7:51 AM

టార్చర్‌ కాదు... ఛాలెంజ్‌!

టార్చర్‌ కాదు... ఛాలెంజ్‌!

మణిరత్నంగారితో చిత్రమంటే టార్చర్‌ కాదు... నటీనటులకు ఓ ఛాలెంజ్‌. మాకు ఆయన ఫుల్‌ ఫ్రీడమ్‌ ఇచ్చారు. కానీ, ఆయన రాసే క్లిష్టమైన కథల్లో నటించడం అంత సులభం కాదు.

‘‘మణిరత్నంగారితో చిత్రమంటే టార్చర్‌ కాదు... నటీనటులకు ఓ ఛాలెంజ్‌. మాకు ఆయన ఫుల్‌ ఫ్రీడమ్‌ ఇచ్చారు. కానీ, ఆయన రాసే క్లిష్టమైన కథల్లో నటించడం అంత సులభం కాదు. అయినా... లైఫ్‌లో ఛాలెంజ్‌ లేకపోతే కిక్‌ ఏముంటుంది? ఈ సినిమాతో మణిరత్నం దర్శకత్వంలో నటించాలనే మా కల నిజమైంది’’ అన్నారు కార్తీ, అదితీరావ్‌ హైదరీలు.

 వీళ్లిద్దరూ జంటగా మణిరత్నం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తమిళ చిత్రం ‘కాట్రు వెలియిడై’ను తెలుగులో ‘చెలియా’ పేరుతో ‘దిల్‌’ రాజు విడుదల చేస్తున్నారు. ఈ నెల 7న వస్తోన్న ఈ సినిమా గురించి కార్తీ, అదితీలు మాట్లాడుతూ – ‘‘ఇప్పటివరకూ మేం చేసిన చిత్రాలకు పూర్తి భిన్నమైన చిత్రమిది. ఓ ఫైటర్‌ పైలట్, ఓ డాక్టర్‌ మధ్య జరిగే ప్రేమకథే ఈ ‘చెలియా’. చిత్రమంతా వీళ్లిద్దరి (మా) పాత్రల చుట్టూ తిరుగుతుంది.

 ఎమోషనల్‌గా చాలా డెప్త్‌ ఉన్న పాత్రల్లో నటించాం. చిత్రీకరణకు ముందు నాలుగైదు నెలలు స్క్రిప్ట్‌ రీడింగ్‌ సెషన్స్‌లో పాల్గొనడం వల్ల, మణిరత్నం సలహాలు పాటించడంవల్ల ఈజీగా నటించేశాం. కానీ, కాశ్మీర్‌లో 4 నుంచి మైనస్‌ 14 డిగ్రీల టెంపరేచర్‌ మధ్య షూటింగ్‌ చేయడానికి కష్టపడ్డాం. ఏఆర్‌ రెహమాన్‌ మంచి బాణీలను, సిరివెన్నెలగారు మంచి సాహిత్యాన్ని అందించారు. సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాం’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement