మణిరత్నం మూవీ లేటెస్ట్ అప్డేట్ | Maniratnam cheliya New Release Date | Sakshi
Sakshi News home page

మణిరత్నం మూవీ లేటెస్ట్ అప్డేట్

Jan 27 2017 4:04 PM | Updated on Sep 5 2017 2:16 AM

మణిరత్నం మూవీ లేటెస్ట్ అప్డేట్

మణిరత్నం మూవీ లేటెస్ట్ అప్డేట్

ఓకె జాను సినిమాతో ఫాంలోకి వచ్చిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం, మరోసారి తన మ్యాజిక్ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఓకె జాను సినిమాతో ఫాంలోకి వచ్చిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం, మరోసారి తన మ్యాజిక్ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. తన మార్క్ రొమాంటిక్ ఎంటర్టైనర్తో ఆడియన్స్ను అలరించనున్నాడు. కోలీవుడ్ యంగ్ హీరో కార్తీ హీరోగా తమిళ తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రం కాట్రు వెలియడై. అతిథి రావు హైదరీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ముందుగా ఈ సినిమా తెలుగు వర్షన్కు డ్యూయెట్ అనే టైటిల్ను నిర్ణయించినా ఇటీవల చెలియా అని మార్చారు. ఈ విషయాన్ని తెలుగు వర్షన్ నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ను కూడా వాయిదా వేశారన్న టాక్ వినిపిస్తోంది. ముందుగా ఈ సినిమాను మార్చి 24న రిలీజ్ చేయాలని భావించినా.. పోస్ట్ ప్రొడక్షన్కు మరింత సమయం కేటాయించాలన్న ఆలోచనతో రిలీజ్ను ఏప్రిల్ 7కు వాయిదా వేశారు. త్వరలోనే రిలీజ్ డేట్పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement