మంచు కొండల్లో మణిరత్నం షూటింగ్ | Mani Ratnam to shoot in Kashmir from month end | Sakshi
Sakshi News home page

మంచు కొండల్లో మణిరత్నం షూటింగ్

Sep 3 2016 12:07 PM | Updated on Sep 4 2017 12:09 PM

మంచు కొండల్లో మణిరత్నం షూటింగ్

మంచు కొండల్లో మణిరత్నం షూటింగ్

ఓకె బంగారం సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం, తన నెక్ట్స్ సినిమా విషయంలో మరింత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. తనకు బాగా కలిసొచ్చిన రొమాంటిక్ జానర్నే ఎంచుకున్న...

ఓకె బంగారం సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం, తన నెక్ట్స్ సినిమా విషయంలో మరింత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. తనకు బాగా కలిసొచ్చిన రొమాంటిక్ జానర్నే ఎంచుకున్న మణి, అదే బాటలో తనకు సక్సెస్ ఇచ్చిన లోకేషన్లలోనే షూటింగ్ను ప్లాన్ చేస్తున్నాడు. అందుకే తన లేటెస్ట్ మూవీ కట్రూ వెలియిదైని కూడా కశ్మీర్ అందాల మధ్య షూట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

కార్తీ, అదితీరావ్ హైదరీలు జంటగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూల్ను ఈ నెలాఖరు నుంచి కశ్మీర్లో షూట్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్లో హీరో హీరోయిన్లతో పాటు కీలక పాత్రలో నటిస్తున్న శ్రద్దా శ్రీనాథ్లపై పలు కీలక సన్నివేశాలను, ఒక పాటను చిత్రీకరించనున్నారు. 2017లో రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, రవి వర్మన్ సినిమాట్రోగఫి బాధ్యతలు తీసుకున్నాడు. మణిరత్నం తన స్వీయ దర్శకత్వంలో మద్రాస్ టాకీస్ బ్యానర్పై నిర్మిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement