బడ్జెట్‌ వెయ్యి కోట్లు!

Mani Ratnam in talks with Jio Studios for Ponniyin Selvan - Sakshi

చోళుల చరిత్రతో ప్రముఖ తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. ఈ నవల ఆధారంగా సినిమా తీయడానికి ఇప్పటివరకూ తమిళ పరిశ్రమలో దివంగత నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్, ఆ తర్వాత నటుడు కమల్‌హాసన్, ఆ తర్వాత దర్శకుడు భారతీరాజా.. ఇలా పలువురు ప్రముఖులు ట్రై చేశారట. అవేవీ నెరవేరలేదు. ఇప్పుడు మణిరత్నం ఈ ప్రయత్నం మొదలుపెట్టారు. అత్యంత పెద్ద బడ్జెట్‌తో ఈ మల్టీస్టారర్‌ మూవీ తెరకెక్కనుంది. రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కించాలని మణిరత్నం అనుకుంటున్నారట. బడ్జెట్‌ 800 నుంచి 1000 కోట్లు అని కోలీవుడ్‌ తాజా టాక్‌. మోహన్‌బాబు, విక్రమ్, ఐశ్వర్యా రాయ్, శింబు, కార్తీ, కీర్తీ సురేష్‌.. ఇలా పలువురు ప్రముఖ తారాగణంతో ఈ చిత్రాన్ని త్వరలో మొదలుపెట్టనున్నారట. అన్నట్లు రాణి పూంగుళలి పాత్రకు అనుష్కను తీసుకున్నారనే వార్త వినిపిస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top