మంచు లక్ష్మి...‘వైఫ్‌ ఆఫ్‌ రామ్‌’ | Manchu Lakshmi New Movie Teaser Was Released | Sakshi
Sakshi News home page

Apr 27 2018 5:54 PM | Updated on Apr 27 2018 7:00 PM

Manchu Lakshmi New Movie Teaser Was Released - Sakshi

మంచు లక్ష్మి ఈ పేరు టాలీవుడ్‌లో తెలియని వారుండరు. విభిన్న కథలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తనలోని నటిని ప్రేక్షకుల ముందు ఆవిష్కరించేందుకు కొత్త కథ, కథనాలకు ఆమె ఎన్నుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మంచు లక్ష్మి లీడ్‌ రోల్‌లో చేస్తున్న ‘వైఫ్‌ ఆఫ్‌ రామ్‌’ సినిమా టీజర్‌ను కింగ్‌ అక్కినేని నాగార్జున  సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. 

ఈ టీజర్‌ను చూస్తే ఇదొక సస్పెన్స్‌ థ్రిల్లర్‌ అని తెలిసిపోతోంది. చనిపోయిన తన భర్త కేసు మిస్టరీని ఛేదించడం, పోలీసు విచారణలో ఎదుర్కొనే ఇబ్బందులు.. ఇలా సినిమాను ఒక సస్పెన్స్‌తో నడిపించినట్టు కనిపిస్తోంది. ప్రియదర్శి పోలీస్‌ పాత్రలో నటించాడు. విజయ్‌ యేలకంటి దర్శకత్వం వహించగా... పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement