యువ డైరెక్టర్‌ అనుమానాస్పద మృతి | Malayalam Women Director Found Dead In Thiruvananthapuram | Sakshi
Sakshi News home page

యువ డైరెక్టర్‌ అనుమానాస్పద మృతి

Feb 25 2019 5:41 PM | Updated on Feb 25 2019 5:44 PM

Malayalam Women Director Found Dead In Thiruvananthapuram - Sakshi

తిరువనంతపురంలోకి నయన ఫ్లాట్‌లోకి వెళ్లి చూడగా..

తిరువనంతపురం : మలయాళ యువ దర్శకురాలు నయన సూర్యన్‌(28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆదివారం రాత్రి ఆమె తన ఫ్లాట్‌లో శవమై కనిపించారని పోలీసులు తెలిపారు. వివరాలు... కేరళలోని అలప్పాడ్‌కు చెందిన నయన.. సినిమా రంగంపై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. లెనిన్‌ రాజేంద్రన్‌, కమల్‌, జీతూ జోసెఫ్‌, డాక్టర్‌ బిజు తదితర ప్రముఖ మలయాళ దర్శకుల వద్ద అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. రెండేళ్ల క్రితం ‘క్రాస్‌వర్డ్‌’ అనే సినిమా ద్వారా మాలీవుడ్‌లో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. సినిమాల్లోకి రాకముందు నాటక రంగంపై దృష్టి పెట్టిన నయన.. పలు అడ్వర్టైజ్‌మెంట్లకు డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.

ఆత్మహత్య చేసుకున్నారా?
ఆదివారం తన కూతురు ఫోన్‌ ఎత్తకపోవడంతో నయన తల్లి.. ఆమె స్నేహితులకి ఫోన్‌ చేశారు. ఈ క్రమంలో వారు తిరువనంతపురంలోకి నయన ఫ్లాట్‌లోకి వెళ్లి చూడగా.. ఆమె ప్రాణాలతో లేరు. ఈ విషయం గురించి ఆమె స్నేహితురాలు ఒకరు మాట్లాడుతూ... నయన గత కొంతకాలంగా డయాబెటిస్‌తో బాధ పడుతున్నట్లు తెలిపారు. అలాగే దర్శకత్వంలో తనకు మెళకువలు నేర్పిన డైరెక్టర్‌ లెనిన్‌ రాజేంద్రన్‌ ఆకస్మిక మృతి(జనవరి 14న)ని తట్టుకోలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కాగా పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే నిజానిజాలు బయటపడతాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసును లోతుగా విచారిస్తున్నామని.. త్వరలోనే ఆమె మృతికి గల కారణాలు వెల్లడిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement