దిలీప్‌ అభిమాని పోస్టుపై తీవ్ర ఆగ్రహం

Malayalam actor Dileep fan threats woman - Sakshi

మలయాళ నటి అపహరణ, లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ నటుడు దిలీప్‌కు ఈ నెల 3న బెయిల్‌ వచ్చిన సంగతి తెలిసిందే. 85 రోజులు జైల్లో గడిపిన అనంతరం దిలీప్‌ బయటకు రావడంతో ఆనందం తట్టుకోలేకపోయిన ఆయన అభిమాని ఒకరు ఫేస్‌బుక్‌లో ఒక విపరీతమైన వ్యాఖ్య చేశాడు. దిలీప్‌కు మద్దతునివ్వని వారిని బెదిరిస్తూ మలయాళంలో అతను పెట్టిన పోస్టు దుమారం రేపుతోంది.  

’దిలీప్‌కు వ్యతిరేకంగా మాట్లాడే స్త్రీవాదులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కేరళ ఇంకా అసలైన కొటేషన్‌ (నేరం చేసేందుకు ఇచ్చే కాంట్రాక్టు) చూడలేదు. దిలీప్‌ కోరుకుంటే.. మీరు పురుషుల ఫోన్లలో సెక్స్‌క్లిప్‌గా మారిపోతారు’అంటూ అతను కామెంట్ పెట్టాడు. ఈ కామెంట్‌ను ’లాసర్స్‌ మీడియా’ అనే ఫేస్‌బుక్‌ పేజీ పోస్టు చేయగా.. దాని స్క్రీన్‌షాట్‌ను లైంగిక వేధింపులకు గురైన సినీ నటి తన స్నేహితురాలు రిమా కల్లింగల్‌కు పంపింది. ఆ స్క్రీన్‌షాట్‌ను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన నటి  రిమా.. అందులో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

’ఫిబ్రవరి 17న కిరాతకమైన దాడికి గురైన నా స్నేహితురాలు తన చుట్టూ జరుగుతున్న ప్రతిదీ చూస్తోంది. ప్రతిదీ వింటోంది. ఈ స్క్రీన్‌షాట్‌ను తనే పంపింది’ అని ఆమె పేర్కొన్నారు. అయితే, ఒక్కడి పోస్టు వల్ల మహిళలు పురుషులందరినీ అదేగాటున వేసి కించపరచవద్దని, నిజమైన పురుషులు మహిళలకు అండగా ఉంటారని, వారిని కాపాడాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ఆమె పోస్టును ’నల్లవనోప్పమ్‌’ (మంచి పురుషులతో), ’అవల్‌క్కోపమ్‌’ (ఆమె వెంటే) హ్యాష్‌ట్యాగ్‌లతో పెద్ద ఎత్తున నెటిజన్లు షేర్‌ చేసుకుంటున్నారు.

నటుడు దిలీప్‌.. నటి రిమా కల్లింగల్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top