మహేష్‌ భార్యపై నటి షాకింగ్‌ కామెంట్స్‌ | Malaika Arora comments on Namrata Shirodkar | Sakshi
Sakshi News home page

మహేష్‌ భార్యపై నటి షాకింగ్‌ కామెంట్స్‌

Feb 23 2018 2:09 PM | Updated on Feb 23 2018 7:06 PM

Malaika Arora comments on Namrata Shirodkar - Sakshi

నమ్రత శిరోద్కర్‌

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్‌పై బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా సంచలన వ్యాఖ్యలు చేశారు.

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్‌పై బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా నేహ ధూపియా నిర్వహిస్తున్న 'వోగ్ బీఎఫ్ఎఫ్' కార్యక్ర‌మానికి మలైకా హాజ‌రైంది. ఆ సంద‌ర్భంగా నేహా అడిగిన పలు ప్రశ్నలకు మలైకా షాకింగ్‌ సమాధానాలు చెప్పింది.

మోడ‌లింగ్‌లో ఎదురైన అనుభ‌వాల గురించి మ‌లైకా ప్రస్తావిస్తూ 'న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌, మోహ‌ర్ జెస్సియా మోడ‌లింగ్‌లో నాకు సీనియ‌ర్లు. అప్ప‌టికే వారు టాప్ మోడ‌ల్స్‌గా కొనసాగుతున్నారు. దాంతో కొత్త‌గా వ‌చ్చిన వారితో వారు పొగ‌రుగా ప్ర‌వ‌ర్తిస్తూ సీనియారిటీ చూపించేవారు. అయితే ఇప్పుడు వారిద్ద‌రితో స్నేహం కొన‌సాగిస్తున్నాను' అని తెలిపింది.

కాగా, బాలీవుడ్‌లోకి రాక‌ముందు మ‌లైకా మోడలింగ్ రంగంలో రాణించింది. సల్మాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ను మలైకా వివాహం చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం మలైకా టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ, అప్పుడప్పుడూ ప్రత్యేక గీతాల్లో మెరుస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement