అతన్ని పెళ్లి చేసుకోవట్లేదు: నటి

Malaika Arora Clarifies That There Is No Marriage With Arjun Kapoor Right Now - Sakshi

బాలీవుడ్‌ నటి, డ్యాన్సర్‌ మలైకా అరోరా తన పెళ్లిపై వస్తున్న పుకార్లకు పుల్‌స్టాప్‌ పెట్టారు. జూమ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘అర్జున్ కపూర్‌తో నేను చాలా హ్యాపీగా ఉన్నాను.  ప్రస్తుతానికి వివాహం చేసుకునే ఆలోచన లేదు’ అని స్పష్టం చేశారు. వీరిద్దరూ ఏ క్షణమైనా పెళ్లి చేసుకుంటారని నిరంతరం వస్తున్న పుకార్లను ఆమె కొట్టిపారేశారు. తన కొడుకు అర్హాన్‌ భవిష్యత్తును గూర్చి ప్రస్తావిస్తూ.. ‘అతనికి సినిమాలు చూడటం, వాటిని అనుసరించడమంటే ఇష్టమని, దానికి  అతను పెరిగిన వాతావరణం ఒక కారణం’ అని చెప్పుకొచ్చారు. అయితే అర్హాన్‌ భవిష్యత్తులో ఏమవుతాడో అనే దానిపై అతనికి స్పష్టత తేదని, ప్రస్తుతానికి తాను కచ్చితంగా చెప్పలేనని అన్నారు.

అర్బాజ్ ఖాన్‌తో విడాకులు తీసుకున్న తర్వాత వయసులో తనకన్నా చిన్నవాడైన అర్జున్‌ కపూర్‌తో డేటింగ్‌ చేయడంతో తనపై తరచూ వస్తున్న ఆన్‌లైన్‌ ట్రోల్స్‌పై ఆమె స్పందించారు. ‘ట్రోల్స్‌ నన్ను ఎప్పుడూ బాధించలేదు. ట్రోల్స్‌ బాధించకుండా ఓ రక్షణ కవచం ఏర్పాటు చేసుకున్నాను. అదే ప్రతికూల పరిస్థితుల నుంచి రక్షిస్తుంది’ అన్నారు. ట్రోల్స్‌ సృష్టించే వారు పూర్తిగా వేరే జాతి అని, గందరగోళానికి ప్రయత్నిస్తారని ఆమె వ్యాఖ్యానించారు.

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top