అగ్రహీరోతో కలిసి ఉంటే కలదు సుఖం... | making movie with top hero is good : dil raju | Sakshi
Sakshi News home page

అగ్రహీరోతో కలిసి ఉంటే కలదు సుఖం...

Dec 11 2013 12:34 AM | Updated on Sep 2 2017 1:27 AM

అగ్రహీరోతో కలిసి ఉంటే కలదు సుఖం...

అగ్రహీరోతో కలిసి ఉంటే కలదు సుఖం...

ఒకప్పుడు ఎన్టీఆర్, సావిత్రి కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్ సినిమా ‘కలిసి ఉంటే కలదు సుఖం’. చాలా మంచి కథ. దానికి మించి మంచి టైటిల్.

ఒకప్పుడు ఎన్టీఆర్, సావిత్రి కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్ సినిమా ‘కలిసి ఉంటే కలదు సుఖం’. చాలా మంచి కథ. దానికి మించి మంచి టైటిల్. ఇప్పుడా టైటిల్‌తో ఓ సినిమా రూపొందనుంది. 2014లో ఆ టైటిల్‌తో ‘దిల్’ రాజు ఓ భారీ చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకు ముందు ఈ సంస్థలో సిద్దార్థ్ హీరోగా ‘ఓ మై ఫ్రెండ్’ చేసిన వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకుడు. రెండేళ్లు శ్రమించి వేణు శ్రీరామ్ ఈ కథను తయారు చేసుకున్నారు. ఓ అగ్రహీరోతో ఈ చిత్రం ఉండనుందని సమాచారం. పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement