వాస్తవ సంఘటనలతో... | Maidanam Movie Launched | Sakshi
Sakshi News home page

వాస్తవ సంఘటనలతో...

Mar 3 2019 6:19 AM | Updated on Mar 3 2019 6:19 AM

Maidanam Movie Launched - Sakshi

జై శంకర్

జై శంకర్, తనీష్‌ అగర్వాల్‌ జంటగా జై శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మైదానం’. శ్రీ సాయి సిరి సంపద మూవీస్‌ పతాకంపై డి.నాగరాజు, ఎం. శివరామకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. జై శంకర్‌ మాట్లాడుతూ– ‘‘ఇదొక డిఫరెంట్‌ యాక్షన్, సస్పెన్స్, కామెడీ థ్రిల్లర్‌. చిన్న పిల్లల మీద బీహార్‌లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఈ నెల 7న రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది.

ఈ సినిమాలో సీనియర్‌ నటీనటులతో పాటు కొత్తవారు నటిస్తారు. హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రి, కేరళలో చిత్రీకరించనున్నాం. త్వరగా షూటింగ్‌ పూర్తి చేసి, దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’’ అన్నారు. పోసాని కృష్ణమురళి, నాగబాబు, సుమన్, భానుప్రియ, ‘రంగస్థలం’ మహేష్, ‘జబర్దస్త్‌’ రాము, రవి దాసరాజు, కరీంషేక్, లతిక తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: క్రాంతి కొణిదెల, సంగీతం: యమ్‌.యమ్‌ కుమార్‌.

Advertisement
 
Advertisement
Advertisement