‘ఇంతకంటే గొప్ప గిఫ్ట్‌ ఇవ్వలేను’ | Mahhi Vij Wishes Hubby Jay Bhanushali Shares First Pic Of Baby Girl | Sakshi
Sakshi News home page

‘ఇంతకంటే గొప్ప గిఫ్ట్‌ ఇవ్వలేను’

Dec 25 2019 6:20 PM | Updated on Dec 25 2019 6:20 PM

Mahhi Vij Wishes Hubby Jay Bhanushali Shares First Pic Of Baby Girl - Sakshi

‘ఈ ఏడాది నీ పుట్టిన రోజును మరింత ప్రత్యేకంగా జరుపాలనుకున్నాను. మన రాజకుమారి కంటే గొప్పదైన బహుమతిని నీకు ఎన్నటికీ ఇవ్వలేను. లవ్‌ యూ తారా. ఈ ఏడు నీకు గొప్పగా ఉండాలని అమ్మ కోరుకుంటోంది. ఈరోజు నీ చిన్నారితో.. హ్యాపీ బర్త్‌డే లవ్‌. జై భనుశాలి’ అంటూ మోడల్‌, టీవీ నటి మహి విజి తన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తమ గారాలపట్టి తార ఫొటోను మొదటిసారిగా అభిమానులతో పంచుకున్నారు. జై సైతం.. తన కూతురి ఫొటోను పోస్ట్‌ చేసి ఫ్యాన్స్‌కు బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చాడు. ‘ మా టెడ్డీబేర్‌, నా జీవితం, నా ఆత్మ, నా సంతోషానికి స్వాగతం పలకండి. మీ మొదటి శ్వాస మమ్మల్ని ఆనందంలో ముంచెత్తింది. తన చిట్టి చిట్టి చేతులు, పొట్టి పాదాలు నా హృదయాన్ని దోచుకున్నాయి’ అని భావోద్వేగానికి లోనయ్యాడు.

కాగా హిందీ టీవీ స్టార్‌ కపుల్‌ మహి విజ్‌-జై భనుశాలిలకు 2011లో వివాహం జరిగింది. ఈ క్రమంలో 2017లో ఈ జంట తమ పనిమనిషి కూతురిని దత్తత తీసుకున్నారు. అయితే ఆమె కన్నతల్లి సమక్షంలోనే పెరుగుతున్నా తనకు సంబంధించిన అన్ని వ్యవహారాలను దగ్గర ఉండి చూసుకుంటున్నారు. ఇక పెళ్లైన దాదాపు 8 ఏళ్ల తర్వాత 2019, ఆగస్టులో వీరికి కూతురు తార జన్మించింది. మహి- జై జంట టీవీ రియాలిటీ షో ‘నచ్‌ బలియే 5’లో పాల్గొని టైటిల్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే. కాగా మహి విజి తెలుగులో డబ్‌ అయిన ‘చిన్నారి పెళ్లి కూతురు’(బాలికా వధు)లో ఆనంది కూతురు నందినిగా టాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా పలకరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement