సూపర్ స్టార్తో మెగాస్టార్ | Mahesh babu, Chiranjeevi Spoted at annapoorna studios | Sakshi
Sakshi News home page

సూపర్ స్టార్తో మెగాస్టార్

Mar 7 2017 12:20 PM | Updated on Sep 5 2017 5:27 AM

సూపర్ స్టార్తో మెగాస్టార్

సూపర్ స్టార్తో మెగాస్టార్

ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శతక్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ లో

ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శతక్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ లో మెగాస్టార్ చిరంజీవి దర్శనమివ్వడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడు షో కోసం రెడీ అయిన మెగాస్టార్, మహేష్ బాబు, మురుగదాస్లతో కలిసి కనిపించారు. సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ఈ ఫోటోను తన ట్విట్టర్ పేజ్లో పోస్ట్ చేయగా.. మురుగదాస్.. 'మా సెట్ను ఎవరు విజిట్ చేశారు చూడండి' అంటూ కామెంట్ చేశాడు.

ప్రస్తుతం మహేష్, మురుగదాస్ల చిత్రం అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటుండగా.. అదే స్టూడియోలో మీలో ఎవరు కోటీశ్వరుడు షో షూట్ కూడా జరుగుతోంది. దీంతో కాలీ సమయంలో మెగాస్టార్ మహేష్ మూవీ సెట్లో సందడి చేశారు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన రమణ సినిమాను ఠాగూర్గా రీమేక్ చేసిన చిరు, తరువాత మురుగదాస్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన స్టాలిన్ సినిమాలో హీరోగా నటించాడు.  తన రీ ఎంట్రీ కోసం కూడా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన కత్తి సినిమానే ఎంచుకున్నాడు. మహేష్తో పాటు మురుగదాస్తో సాన్నిహిత్యం కారణంగా మెగాస్టార్ సూపర్ స్టార్ సెట్లో సందడి చేశాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement