హ్యాపీ బర్త్‌డే

Mahesh Babu at Allari Naresh Birthday Celebrations - Sakshi

‘హ్యాపీ బర్త్‌డే నరేశ్‌’ అంటూ మహేశ్‌బాబు, వంశీ పైడిపల్లి విషెస్‌ చెబితే, ‘అల్లరి’ నరేశ్‌ బర్త్‌డే కేక్‌ కట్‌ చేశారు. నరేశ్‌ బర్త్‌డే డెహ్రాడూన్‌లో జరిగింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌ బాబు, పూజా హెగ్డే జంటగా ఓ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇందులో ‘అల్లరి’ నరేశ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం డెహ్రాడూన్‌లో జరుగుతోంది. శనివారం ‘అల్లరి’ నరేశ్‌ బర్త్‌డే. ఆయన బర్త్‌డే సెలబ్రేషన్‌ సినిమా టీమ్‌ సమక్షంలో జరిగింది.

‘‘మా రవికి (సినిమాలో క్యారెక్టర్‌ పేరు) జన్మదిన శుభాకాంక్షలు. మీతో అద్భుతమైన టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నాను. రాబోయే సంవత్సరాలు కూడా మీకు బెస్ట్‌గా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని దర్శకుడు వంశీ పైడిపల్లి పేర్కొన్నారు. ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో పూజా హెగ్డే, శిరీష్, కెమెరామేన్‌ కేయు మోహనన్‌ పాల్గొన్నారు. ఈ సినిమా షెడ్యూల్‌ విషయానికి వస్తే.. జూలై సెకండ్‌ వీక్‌ వరకూ డెహ్రాడూన్‌లో కాలేజ్‌ సీన్స్‌ షూట్‌ చేయనున్నారట. ఆ తర్వాత అమెరికా షెడ్యూల్‌ ప్లాన్‌ చేయనున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top