తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న మహేష్‌ 25

Mahesh Babu 25th Movie Completes First Schedule - Sakshi

భరత్‌ అనే నేను సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు, అశ్వనిదత్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు కాలేజ్‌ స్టూడెంట్ పాత్రలో నటిస్తుండటం విశేషం. తొలి షెడ్యూల్‌లో కాలేజ్‌కి సంబంధించిన సన్నివేశాలను డెహ్రడూన్‌లో చిత్రీకరించారు.

24 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్‌ పూర్తయ్యింది. భారీ షెడ్యూల్‌ పూర్తి చేసిన మహేష్‌ అండ్‌ టీం ప్రస్తుతం షార్ట్‌బ్రేక్‌ తీసుకున్నారు. త్వరలోనే మరో షెడ్యూల్‌ కోసం అమెరికా వెళ్లనున్నారు. మహేష్ బాబు సరసన పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్‌ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top