‘మా’ను రోడ్డు మీదకు తీసుకురాకండి

Maa sivaji raja fire on actor naresh - Sakshi

‘‘మార్చిలో ‘మా’ ఎలక్షన్స్‌ జరపండి. ఏప్రిల్‌లో చార్జ్‌ తీసుకోండి అని బై లాలో ఉంది. ఇదే లాయర్‌కు చెప్పాను. ‘ఇన్నిరోజులు ఆగాలా? అప్పటి వరకు అతనే పదవి అనుభవిస్తాడా?’ అన్నారు. జనరల్‌ బాడీలో మాట్లాడుకోవాల్సిన విషయాన్ని ప్రెస్‌మీట్‌ పెట్టి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు. ప్రెస్‌మీట్‌లు పెట్టొద్దు. పని చేద్దాం. ‘మా’ను రోడ్డు మీదకు లాగకండి’’ అని శివాజీరాజా అన్నారు. ఇటీవల జరిగిన ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) ఎలక్షన్స్‌లో నరేశ్‌ అధ్యక్షడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. కొత్త ప్యానెల్‌ ప్రమాణ స్వీకారానికి శివాజీ రాజా అడ్డుపడుతున్నారని ఓ ప్రెస్‌మీట్‌లో నరేశ్‌ అన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో శివాజీరాజా మాట్లాడుతూ – ‘‘22 ఏళ్లుగా ‘మా’లో నేను చేయని పదవి లేదు.

‘మా’ డబ్బులతో ఒక్క టీ తాగలేదు నేను. సడన్‌గా వచ్చి, ఫైల్‌లో ఏదో తప్పు ఉందంటారు. తప్పు చేసినట్లు ఉంటే శిక్ష అనుభవిస్తాను. గోల్డేజ్‌ హోమ్‌ అనే నా కలపై నీళ్లు చల్లారు. ఎవరూ లేని వ్యక్తి భీమవరం నుంచి ఇక్కడికి వచ్చి గోల్డేజ్‌హోమ్‌ పేరుతో బిల్డింగ్‌ కట్టిస్తే పేరు అంతా వీడికే వచ్చేస్తుంది అనుకున్నవారి కుట్రలో బలైపోయాను. మీరు కట్టండి. గ్రేట్‌ అని ఒప్పుకుంటా. ‘శివాజీ.. నువ్వు పడుతున్న కష్టం చూశాను. కేటీఆర్‌గారితో మాట్లాడి మీకు సైట్‌ ఇప్పిస్తా’నని 24గంటల్లో కేటీఆర్‌గారితో చిరంజీవిగారు మాట్లాడారు. ఎలక్షన్‌కోడ్‌ రావడం వల్ల అది ఆగిపోయింది. ఆ సైట్‌ వచ్చి ఉంటే నా కల సాకారం అయ్యేది. ప్రతి ఏడాది ‘మా’ డైరీ నేను వేస్తాను. కానీ ఈ ఏడాది నరేశ్‌గారు కమిటీ పెట్టాను. డైరీ నేను వేస్తాను అన్నారు. డైరీకి 14 లక్షల 20వేలు వచ్చిందని చెప్పారు. అకౌంట్‌లో 7లక్షలే పడ్డాయి. మిగతా డబ్బులు ఏమైపోయాయి? అకౌంట్స్‌ అప్పజెప్పి ప్రమాణ స్వీకారం చేస్తే బాగుంటుంది’’ అన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top