ప్రేమకు భాష లేదు... | Love Ishq Kadal: No Language for Love | Sakshi
Sakshi News home page

ప్రేమకు భాష లేదు...

Oct 21 2013 12:37 AM | Updated on Aug 28 2018 4:30 PM

ప్రేమకు భాష లేదు... - Sakshi

ప్రేమకు భాష లేదు...

ప్రేమకు భాషతో సంబంధం లేదు. దానిక్కావల్సిందల్లా రెండు హృదయాలు కలవడమే. మనసులు కలిసిన తర్వాత ఎవరికి నచ్చిన రీతిలో వాళ్లు ప్రేమను వ్యక్తం చేసుకుంటారు. అలా మూడు జంటలు ‘ప్రేమ... ఇష్క్... కాదల్’ అంటూ మురిపెంగా తమ ప్రేమను వ్యక్తం చేసుకున్నాయి.

ప్రేమకు భాషతో సంబంధం లేదు. దానిక్కావల్సిందల్లా రెండు హృదయాలు కలవడమే. మనసులు కలిసిన తర్వాత ఎవరికి నచ్చిన రీతిలో వాళ్లు ప్రేమను వ్యక్తం చేసుకుంటారు. అలా మూడు జంటలు ‘ప్రేమ... ఇష్క్... కాదల్’ అంటూ మురిపెంగా తమ ప్రేమను వ్యక్తం చేసుకున్నాయి. ఇష్క్ అన్నా ప్రేమే... కాదల్‌కీ అదే అర్థం. ఒకే అర్థం వచ్చే ఈ మాటను మూడు భాషల్లో ఎందుకు చెప్పినట్లు...? అదే సస్పెన్స్ అంటున్నారు బెక్కెం వేణుగోపాల్ (గోపి). 
 
అగ్ర నిర్మాత డి.సురేష్‌బాబు సమర్పణలో షిర్డిసాయి కంబైన్స్ భాగస్వామ్యంతో లక్కీ మీడియా పతాకంపై ఆయన నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమ ఇష్క్ కాదల్’. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసిన పవన్ సాదినేని ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. హర్షవర్థన్ రాణే, విష్ణు, హరీష్, వితిక షేరు, రీతూవర్మ, శ్రీముఖి ఇందులో హీరో హీరోయిన్లు. ఈ నెల 24న మధుర ఆడియో ద్వారా పాటల్ని విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత గోపి మాట్లాడుతూ -‘‘శ్రవణ్ స్వరపరచిన పాటలు ఈ సినిమాకు మెయిన్ హైలైట్. పాటలన్నీ వీనుల విందుగానే కాదు.. కనువిందుగానూ ఉంటాయి.
 
 సినిమా చిత్రీకరణ అంతా పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని తెలిపారు. దర్శకుడు పవన్ సాదినేని మాట్లాడుతూ - ‘‘భారీ నిర్మాణ విలువలతో స్టయిలిష్‌గా రూపొందుతోన్న యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. మూడు జంటల ప్రేమాయణాన్ని సరికొత్త రీతిలో ఆవిష్కరించాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, కళ: మోహన్, కూర్పు: గౌతమ్ నెరుసు, పాటలు: కృష్ణచైతన్య, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రమేష్ కైగురి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement