తెలుగు, తమిళాల్లో... బన్నీ | Lingusami's bilingual with Allu Arjun | Sakshi
Sakshi News home page

తెలుగు, తమిళాల్లో... బన్నీ

Jan 29 2016 11:38 PM | Updated on Sep 3 2017 4:34 PM

తెలుగు, తమిళాల్లో... బన్నీ

తెలుగు, తమిళాల్లో... బన్నీ

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టి, పెరిగింది చెన్నయ్ లోనే. బన్నీకి తమిళం బాగా వచ్చు.

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టి, పెరిగింది చెన్నయ్ లోనే. బన్నీకి తమిళం బాగా వచ్చు. ఒకవేళ తమిళ సినిమాలో నటిస్తే, ఎంచక్కా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పేసుకోవచ్చు. త్వరలో అది జరగనుంది. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొంద నున్న ఓ చిత్రంలో నటించడానికి బన్నీ అంగీకరించారని సమాచారం. ఈ చిత్రానికి లింగుస్వామి దర్శకత్వం వహిస్తారట. అల్లు అర్జున్ మంచి మాస్ హీరో. లింగుస్వామి మంచి మాస్ డెరైక్టర్. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘సండై కోళి’ (పందెం కోడి), ‘పయ్యా’ (ఆవారా), ‘వేట్టయ్’, ‘కుమ్కీ’ (గజరాజు) వంటి మాస్ మూవీలు కమర్షియల్‌గా విజయం సాధించాయి.

సో.. మాస్ హీరో అల్లు అర్జున్‌తో లింగుస్వామి భారీ మాస్ కమర్షియల్ తీస్తారని ఊహించవచ్చు. ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ‘ఇడమ్ పొరుళ్ ఏవల్’ అనే తమిళ చిత్రం రూపొందుతోంది. బహుశా ఆ చిత్రం తర్వాత ఆయన చేయబోయేది అల్లు అర్జున్ చిత్రమే అవుతుందేమో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement