‘కాలా’కు ఊరట | Line Clear For Rajini Kaala Release In Karnataka | Sakshi
Sakshi News home page

Jun 5 2018 4:18 PM | Updated on Sep 27 2018 8:27 PM

Line Clear For Rajini Kaala Release In Karnataka - Sakshi

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం కాలా. కబాలి ఫేం పా రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కోలీవుడ్‌ హీరో, రజనీ అల్లుడు ధనుష్‌ నిర్మిస్తున్నారు. పలు వాయిదాల తరువాత ఈ గురువారం విడుదలకు రెడీ అయిన ఈ సినిమాకు కర్ణాటకలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో కావేరి వివాదంలో రజనీ వ్యాఖ్యల కారణంగా వివాదం మొదలైంది. పలు కన్నడ సంస్థలు కాలా రిలీజ్‌ను అడ్డుకుంటామంటూ ప్రకటలు చేశాయి.

ఈ విషయంపై చిత్ర నిర్మాత ధనుష్‌.. కర్ణాటక హైకోర్డును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం, సినిమా ప్రదర్శించేందుకు ముందుకు రాని థియేటర్ల యజమానులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పింది. కానీ కాలా సినిమాను ప్రదర్శించేందుకు సిద్ధమైన థియేటర్ల లిస్ట్‌ ప్రభుత్వానికి అందిస్తే వారు ఆ థియేటర్లకు రక్షణ కల్పిస్తారని కోర్టు వ్యాఖ్యనించింది. కోర్టు వ్యాఖ్యాలతో కర్ణాటకలో కాలా రిలీజ్‌కు మార్గం సుగమమైనట్టుగా భావిస్తున్నారు రజనీ ఫ్యాన్స్‌. జూన్‌ 7న కాలా ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్‌ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement