పాముకాటు.. మంచిదే! | Lindsay Lohan Bitten by Snake During Hike in Thailand | Sakshi
Sakshi News home page

పాముకాటు.. మంచిదే!

Jan 8 2018 12:45 AM | Updated on Aug 20 2018 7:28 PM

Lindsay Lohan Bitten by Snake During Hike in Thailand - Sakshi

హాలీవుడ్‌ స్టార్‌ లిండ్సే లోహన్‌కు ట్రావెలింగ్‌ అంటే పిచ్చి. టైమ్‌ దొరికితే చాలు దేశాలు తిరిగేస్తుంది. తాజాగా ఆమె హాలీడేపై థాయ్‌లాండ్‌ వెళ్లింది. చల్లని సాయంత్రం. ఎంచక్కా స్విమ్మింగ్‌ పూల్‌లో కూర్చొని సేదతీరుతోంది. ఎక్కణ్నుంచి వచ్చిందో తెలీదు, ఓ పాము వచ్చి, ఆమె ఎడమ కాలిపై కాటు వేసింది. వెంటనే తేరుకొని, తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్న లిండ్సే, ప్రాణాపాయం లేకుండా సేఫ్‌గా బయటపడింది. అయితే ఇదేమీ ఇలా చెప్పుకొని వదిలేసేంత చిన్న విషయం కాదు. కొంచెం అటూ ఇటైనా ప్రాణానికే ప్రమాదం జరిగి ఉండేది.

ఇదిలా ఉంటే ‘పాముకాటు ఓ రకంగా మంచికే జరిగిందిలే!’ అంటూ లిండ్సే కామెంట్‌ చేయడాన్ని విశేషంగా చెప్పుకోవాలి. ‘‘థాయ్‌లాండ్‌ ట్రిప్‌ బాగా జరిగింది. ఒక్క పాముకాటెయ్యడం తప్పితే! అయినా అదీ ఒక రకంగా మంచికేనేమో! పాముకాటేస్తే అదృష్టం కలిసివస్తుందని, పాజిటివ్‌ ఎనర్జీ వస్తుందని అంటారు.’’ అంటూ ఈ విషయాన్ని చాలా సింపుల్‌గా తేల్చిపడేసింది లిండ్సే లోహన్‌. గతంలో ఇలాగే హాలీడేలో ఆమె చేతి వేలు సగం తెగింది. ఇంతా జరిగినా ట్రావెలింగ్‌ అంటే నాకున్న పిచ్చి ఎప్పటికీ తగ్గదు అంటోంది లిండ్సే లోహన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement