బోర్‌ కొట్టేసింది | Laxmi Rai's Where Is The Venkata Lakshmi | Sakshi
Sakshi News home page

బోర్‌ కొట్టేసింది

Dec 8 2018 1:32 AM | Updated on Dec 8 2018 1:32 AM

Laxmi Rai's Where Is The Venkata Lakshmi - Sakshi

‘‘ఒకే  పనిని అదే పనిగా చేస్తే?  బోర్‌ కొడుతుంది... కచ్చితంగా బోర్‌ కొడుతుంది. అది ఏ ఫీల్డ్‌లో అయినా సరే. కొత్తదన ం లేనప్పుడు పని రొటీన్‌ అయిపోతుంది. చేసే పనిలో కిక్కుండదు. నాక్కూడా నేను చేసిన పని బోర్‌ కొట్టేసింది’’ అంటున్నారు రాయ్‌లక్ష్మీ. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ– ‘‘ఆ మధ్య అన్నీ ఒకేలాంటి పాత్రలు, సినిమాలు చేశాను. దాంతో బోర్‌ అనిపించింది. చేసే ఏ పనైనా కొత్తగా ఉంటే నూతనోత్సాహం వస్తుంది.

అందుకే నేను చేసిన తప్పులను సరిద్దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం డిఫరెంట్‌ సినిమాలు, పాత్రలు ఎంచుకుంటున్నాను. తమిళంలో ‘నీయా’ అనే సినిమా చేస్తున్నా. అది పాములకు సంబంధించిన చిత్రం. ‘సిండ్రిల్లా’ అనే హారర్‌ ఎంటర్‌టైనర్‌తో పాటు ‘మిరుగా’ అనే సస్పెన్స్‌ థ్రిల్లర్‌లో నటిస్తున్నా. ఇందులో విధవరాలిగా చేస్తున్నాను. ‘వేర్‌ ఈజ్‌ వెంకటలక్ష్మీ’లోనూ మంచి పాత్ర చేస్తున్నాను. ఇలా డిఫరెంట్‌ జానర్‌ సినిమాలు చేస్తుంటే నా పని నాకే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement