కనబడుట లేదు! | Laxmi Rai's Where Is The Venkata Lakshmi | Sakshi
Sakshi News home page

కనబడుట లేదు!

Aug 10 2018 1:04 AM | Updated on Aug 10 2018 1:05 AM

Laxmi Rai's Where Is The Venkata Lakshmi - Sakshi

రాయ్‌లక్ష్మీ

ఎవరో తెలుసా? వెంకటలక్ష్మి. కుటుంబ సభ్యులు కంగారుపడి, పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరి.. వెంకటలక్ష్మిని ఎవరైనా దాచారా? లేక ఏదైనా సమస్య నుంచి తప్పించుకోవాలని పారిపోయి తనే దాక్కుందా? అనే ప్రశ్నలకు కొన్ని రోజుల తర్వాత వెండితెరపై సమాధానం దొరకుతుంది. వెంకటలక్ష్మిగా థియేటర్‌లోకి రాబోతున్నది రాయ్‌లక్ష్మీ. గతేడాది ‘ఖైదీ నంబర్‌ 150’ సినిమాలో ‘రత్తాలు రత్తాలు..’ స్పెషల్‌ సాంగ్‌లో నర్తించి యూత్‌ను ఉర్రూతలూగించారామె. ఇప్పుడు రాయ్‌లక్ష్మీ తెలుగులో హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా ‘వేర్‌ ఈజ్‌ వెంకటలక్ష్మి’. కిశోర్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కార్తీక్, ప్రవీణ్, మధునందన్, పూజిత పొన్నాడ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఎమ్‌. శ్రీధర్‌ రెడ్డి, హెచ్‌.ఆనంద్‌ రెడ్డి, ఆర్కే రెడ్డి నిర్మిస్తున్నారు. హరి గౌర సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దసరా సందర్భంగా రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement