షూటింగ్ పూర్తి చేసుకున్న 'వెంకటలక్ష్మి' | Laxmi Rai Where Is The Venkatalakshmi Movie Shooting Completed | Sakshi
Sakshi News home page

Jan 30 2019 6:52 PM | Updated on Jan 30 2019 7:03 PM

Laxmi Rai Where Is The Venkatalakshmi Movie Shooting Completed - Sakshi

హీరోయిన్‌గా ఓ మోస్తరు సినిమాలు చేస్తూ.. ఖైదీ నెంబర్‌150 సినిమాలోని రత్తాలు సాంగ్‌తో ఫేమస్‌ అయిపోయింది లక్ష్మీరాయ్‌. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. తాజాగా ఓ లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు రాయ్‌లక్ష్మీ సిద్దమవుతోంది.

హార్రర్ కామెడీగా  తెరకెక్కుతున్న ‘వేర్‌ ఈజ్‌ ది వెంకటలక్ష్మీ’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మేకర్స్‌ ప్రకటించారు. ఈ మధ్యే ఈ మూవీ నుంచి విడుదల చేసిన 'పాపా నీకేదంటే ఇష్టం' పాటకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రాగ, త్వరలో టీజర్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్మాతలు. ఎం.శ్రీధర్ రెడ్డి , హెచ్.ఆనంద్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement