స్వచ్ఛభారత్లో మంచు మనోజ్, లక్ష్మి | laxmi manchu and manoj participates swachcha bharat | Sakshi
Sakshi News home page

స్వచ్ఛభారత్లో మంచు మనోజ్, లక్ష్మి

Nov 21 2014 5:12 PM | Updated on Aug 28 2018 4:30 PM

స్వచ్ఛభారత్లో మంచు మనోజ్, లక్ష్మి - Sakshi

స్వచ్ఛభారత్లో మంచు మనోజ్, లక్ష్మి

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ లింగంపల్లి రైల్వేస్టేషన్లో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. మంచు లక్ష్మి కూడా ఫిల్మ్నగర్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ లింగంపల్లి రైల్వేస్టేషన్లో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమం వల్ల దేశం బాగుపడుతుందంటే అందుకు తమ మద్దతు తప్పనిసరిగా ఉంటుందని మనోజ్ తెలిపాడు. అయితే ప్రచార ఆర్భాటాల కోసం మాత్రం స్వచ్ఛభారత్ను ఉపయోగించుకోవద్దని రాజకీయ, సినీ ప్రముఖులకు విజ్ఞప్తి చేశాడు. తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్, సినిమా హీరోలు అంతా కలిసి ప్రతిచోటా స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొంటామని తెలిపాడు.

ఇక మరోవైపు మనోజ్ సోదరి, నటి, నిర్మాత మంచు లక్ష్మి కూడా ఫిల్మ్నగర్లో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. ఫిల్మ్నగర్ బస్తీ రోడ్లతో పాటు, అక్కడి ప్రభుత్వ పాఠశాల పరిసరాల్లో ఆమె ఈ కార్యక్రమం చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement