డిసెంబర్లో ముని 3 | Lawrence's Muni 3 to release in December | Sakshi
Sakshi News home page

డిసెంబర్లో ముని 3

Sep 4 2014 12:32 AM | Updated on Sep 2 2017 12:49 PM

డిసెంబర్లో ముని 3

డిసెంబర్లో ముని 3

ప్రయోగాలు చేసే దర్శకులలో నృత్య దర్శకుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ఒకరు. ముని, ముని-2గా కాంచన చిత్రాలను తెరకెక్కించి హారర్ చిత్రాల ట్రెండ్‌కు సరికొత్త ఊపు తీసుకొచ్చిన లారెన్స్

 ప్రయోగాలు చేసే దర్శకులలో నృత్య దర్శకుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ఒకరు. ముని, ముని-2గా కాంచన చిత్రాలను తెరకెక్కించి హారర్ చిత్రాల ట్రెండ్‌కు సరికొత్త ఊపు తీసుకొచ్చిన లారెన్స్ తాజాగా ముని-3గా గంగ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. తాప్సీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా రాఘవేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఒరు టిక్కెటిల్ రెండు సినిమా ఒండ్రు కిళవన్ ఒండ్రు కరుప్పుదురై అనే వైవిధ్య భరిత చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్నారు. తమిళం, తెలుగు భాషల్లో రూపొందించనున్న ఈ చిత్రం గురించి బుధవారం విలేకరుల సమావేశంలో రాఘవ లారెన్స్ వెల్లడిస్తూ ఈ చిత్రాన్ని రెండు కథలుగా తెరకెక్కించనున్నట్లు తెలిపారు. చిత్రం తొలి భాగంలో తనకు జోడిగా ఆండ్రియూ నటించనుండగా రెండో భాగంలో నటి రాయ్‌లక్ష్మి నటించనున్నారని వివరించారు. తమిళ వెర్షన్‌కు గీత రచయిత వివేక్ సంభాషణలందిస్తున్నారని తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement