పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి | Lavanya Tripathi Has Lodged A Complaint With Police Against Sunisith | Sakshi
Sakshi News home page

పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

Mar 17 2020 4:08 PM | Updated on Mar 17 2020 4:33 PM

Lavanya Tripathi Has Lodged A Complaint With Police Against Sunisith - Sakshi

హైదరాబాద్‌ : హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న ఓ వ్యక్తిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మెయిల్‌ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. శ్రీరామోజు సునిశిత్ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకున్నాడని అసత్య ప్రచారం చేస్తున్నారని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, సునిశిత్‌ పలు యూట్యూబ్‌ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో లావణ్యపై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

లావణ్య ఫిర్యాదుపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ మాట్లాడుతూ.. యూట్యూబ్‌ చానెల్స్‌లో సునిశిత్‌ చేసిన వ్యాఖ్యలను పరిశీలించామని తెలిపారు. ఆడవారిపై అసభ్యంగా మాట్లాడితే జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. సునిశిత్‌ ఇతర సెలబ్రిటీలపైన కూడా వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఇప్పటివరకు లావణ్య మాత్రమే ఫిర్యాదు చేశారని వెల్లడించారు. లావణ్య ఫిర్యాదుపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.

సినిమాల విషయానికి వస్తే.. సందీప్‌ కిషన్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ చిత్రంలో ఆమె నటిస్తున్నారు. హాకీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డెన్నిస్‌ జీవన్‌ కనుకొల దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే తమిళ్‌లో అథర్వ మురళి హీరోగా నూతన దర్శకుడు రవీంద్ర మాధవ తెరకెక్కిస్తున్న చిత్రంలో ఐఏఎస్‌ కావాలనుకునే అమ్మాయి పాత్రలో లావణ్య కనిపించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement