ఆఫీసర్‌ ఝాన్సీ | Lakshmi Rai new movie Jhansi look release | Sakshi
Sakshi News home page

ఆఫీసర్‌ ఝాన్సీ

Jan 12 2019 1:00 AM | Updated on Jan 12 2019 1:00 AM

Lakshmi Rai new movie Jhansi look release - Sakshi

రాయ్‌లక్ష్మీ

ఆరేళ్ల తర్వాత కన్నడంలో రాయ్‌లక్ష్మీ నటిస్తున్న సినిమా ‘ఝాన్సీ’. 2013లో వచ్చిన ‘అట్టహాస’ రాయ్‌లక్ష్మీ తొలి కన్నడ చిత్రం. ‘ఝాన్సీ’ చిత్రానికి పీవీఎస్‌ గురుప్రసాద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నారు రాయ్‌లక్ష్మీ. సినిమాలో ఆమె లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌లో కాగడా పట్టుకుని కోపంగా రాయ్‌లక్ష్మీ చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు కదూ. ఈ చిత్రంలో ఆమె కొన్ని రియల్‌ స్టంట్స్‌ కూడా చేశారు. ‘‘కన్నడంలో నా తర్వాతి చిత్రం ‘ఝాన్సీ’ లుక్‌ను విడుదల చేసి నందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్రం త్వరలో విడుదలవుతుంది’’ అన్నారు రాయ్‌లక్ష్మీ.

Advertisement
 
Advertisement
Advertisement