అ.. ఆ.. అదిరే! | Kriti Sanon to star opposite Aamir Khan in 'Thugs of Hindostan'? | Sakshi
Sakshi News home page

అ.. ఆ.. అదిరే!

Dec 28 2016 12:08 AM | Updated on Sep 4 2017 11:44 PM

అ.. ఆ.. అదిరే!

అ.. ఆ.. అదిరే!

హిందీ చిత్రసీమలో ‘అ’ అంటే అమితాబ్‌ బచ్చన్‌! సెకండ్‌ ఛాయిస్‌కి ఛాన్స్‌ లేదు. మరి, ‘ఆ’ అంటే ఆమిర్‌ఖాన్‌!

హిందీ చిత్రసీమలో ‘అ’ అంటే అమితాబ్‌ బచ్చన్‌! సెకండ్‌ ఛాయిస్‌కి ఛాన్స్‌ లేదు. మరి, ‘ఆ’ అంటే ఆమిర్‌ఖాన్‌! మరో ఆప్షన్‌ లేదంతే. తమ అసాధారణ నటనతో భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. ఇప్పుడీ ‘అ’, ‘ఆ’లు కలసి నటించనున్న తొలి హిందీ సినిమా ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’. ఇందులో హీరోయిన్‌గా ‘1... నేనొక్కడినే’, ‘దోచేయ్‌’ సినిమాల ఫేమ్‌ కృతీ సనన్‌ నటించనున్నారని బాలీవుడ్‌ టాక్‌. ఆమిర్‌ఖాన్‌కు జోడీగా కృతిని తీసుకున్నారట.

అంతే కాదండోయ్‌... చిత్ర పరిశ్రమలో స్నేహితుల దగ్గర కృతి నటన గురించి ఆమిర్‌ చెబుతున్నారట. ప్రామిసింగ్‌ యంగ్‌స్టర్స్‌లో కృతి ఒకరని అన్నారట. ఓ వైపు అమితాబ్‌ బచ్చన్‌... మరోవైపు ఆమిర్‌ఖాన్‌... ఇద్దరు సూపర్‌స్టార్‌లు కలసి నటిస్తున్న తొలి సినిమాలో తనకు అవకాశం రావడం పట్ల హీరోయిన్‌ కృతీ సనన్‌ సంతోషంగా ఉన్నారని ముంబయ్‌ వర్గాల సమాచారం. వచ్చే ఏడాది మార్చిలో ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ చిత్ర షూటింగ్‌ ప్రారంభించి, ఆ తరువాత ఏడాది 2018 దీపావళికి విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement