ఎలాంటి పాత్రకైనా రెడీ! | Kriti Kharbanda Says About Feature Projects | Sakshi
Sakshi News home page

Apr 14 2018 10:25 AM | Updated on Apr 14 2018 10:25 AM

Kriti Kharbanda  Says About Feature Projects - Sakshi

తమిళ సినిమా : ఎలాంటి పాత్రకైనా రెడీ అంటోంది నటి కృతి కర్బంద. ఈ ఢిల్లీ భామ మోడలింగ్‌ రంగం నుంచి సినీరంగానికి పరిచయమైంది. చాలా మంది ఉత్తరాది తారల మాదిరిగానే తొలుత తెలుగులో ‘బోణి’ కొట్టిన ఈ బ్యూటీ ఆ తరువాత కన్నడం, హిందీ, తమిళం భాషాల్లో వరుసగా ఎంట్రీ ఇచ్చేసింది. అయితే తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనే ఎక్కువగా నటిస్తున్న కృతి కర్బంధ తమిళంలో జీవీ.ప్రకాశ్‌కుమార్‌తో బ్రూస్‌లీ అనే ఒక్క చిత్రంలోనే రొమాన్స్‌ చేసింది. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అందుకేనేమో  ఆ తరువాత ఇక్కడ మళ్లీ కనిపించలేదు. 

తాజాగా మళ్లీ కోలీవుడ్‌లో ఎలాగైనా అవకాశాలందుకోవాలని ఆరాట పడుతోంది. తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకునేందుకు ఓ ఆసక్తికర ట‍్వీట్ చేశారు. ‘నాకు వైవిధ్యభరిత కథా చిత్రాల్లో నటించే అవకాశాలే వస్తుండడం సంతోషంగా ఉంది. ఎలాంటి పాత్రల్లో నటించాలని ఆశ పడుతున్నారు అని అడుగుతుంటారు. నటనకు అవకాశం ఉన్న ఎలాంటి పాత్రల్లో నటించడానికైనా నేను రెడీ. పాత్రలను బట్టి లంగా ఓణి, చీరలు, మోడ్రన్‌ ఇలా అన్ని రకాల దుస్తులైనా ధరించాల్సి ఉంటుంది. అలా ఆయా పాత్రలకు తగ్గట్టుగా నన్ను నేను తయారు చేసుకుంటాను. అయితే ఢిల్లీ అమ్మాయిని కదా స్వతహాగా నాకు మోడ్రన్‌ దుస్తులు ధరించడమంటేనే ఇష్టం. అలాంటి పాత్రలైతే మరింత ఆసక్తి. ఇకపోతే తమిళంలో మంచి పాత్రల్లో నటించాలనుంది. అలాంటి అవకాశాలు ఆశిస్తున్నాను’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement