పల్లెటూరు టు వండర్‌ వరల్డ్‌

kovera new movie u released on july - Sakshi

రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్‌ వద్ద అసి స్టెంట్‌గా పనిచేసిన కొవెర హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘యు’. హిమాన్షి కాట్రగడ్డ కథానాయిక. నాగానిక సమర్పణలో విజయలక్ష్మీ కొండా, నాగానిక చాగంరెడ్డి నిర్మించిన ఈ సినిమా జూలైలో రిలీజ్‌ కానుంది. హీరో, దర్శకుడు కొవెర మాట్లాడుతూ– ‘‘యు’ టైటిల్‌కి కథే హీరో. విజయేంద్రప్రసాద్‌గారి వద్ద పనిచేసిన అనుభవంతో ఈ కథ రాసుకున్నా. పల్లెటూరిలో మొదలై వండర్‌ వరల్డ్‌లో ఎండ్‌ అయ్యే కథ ఇది. ఈ చిత్రం చేయడానికి మా అమ్మ, నా భార్య మద్దతుగా నిలిచారు.

టాలీవుడ్‌లో ఇప్పటివరకూ ఎవరూ టచ్‌ చేయని ప్రాజెక్ట్‌ ఇది’’ అన్నారు.‘‘మా అబ్బాయి ప్రతిరోజూ నన్ను ‘ఒక్క చాన్స్‌ అమ్మ. సినిమా చేయాలి’ అని అడిగేవాడు. మా అబ్బాయి కోసం ఈ సినిమా చేశాం’’ అన్నారు విజయలక్ష్మీ కొండా. ‘‘డిజిటలైజేషన్‌కి సంబంధించిన కథ ఇది. దాన్ని పాజిటివ్‌ కోణంలో చూపించా రు’’ అన్నారు  నటుడు ‘శుభలేఖ’ సుధాకర్‌. ‘‘సినిమా పరిశ్రమకు ఎన్నో ఆశలతో వచ్చారు కొవెర. ప్రాణం పెట్టి ఈ సినిమా చేశారు’’ అన్నారు నటుడు తనికెళ్ల భరణి. నాగానిక, హిమాన్షి, కెమెరామేన్‌ రాకేశ్‌ గౌడ్‌ పాల్గొన్నారు. ఈ సినిమాకు సంగీతం: సత్య మహావీర్, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: నాగశివ గణపర్తి, సహ నిర్మాత: మూర్తి నాయుడు పాదం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top