కోతల రాయుడు | Kothala Rayudu Movie launched | Sakshi
Sakshi News home page

కోతల రాయుడు

Jul 10 2018 12:34 AM | Updated on Jul 10 2018 12:34 AM

Kothala Rayudu Movie launched - Sakshi

నటాషా, శ్రీకాంత్, డింపుల్‌

శ్రీకాంత్‌ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘కోతల రాయుడు’. ‘కృష్ణాష్టమి’ ఫేమ్‌ డింపుల్‌ చోపడే, ‘జై సింహా’ ఫేమ్‌ నటాషా దోషి కథానాయికలు. ‘జయహే’ సినిమాని తెరకెక్కించిన సుధీర్‌ రాజు దర్శకత్వంలో వెంకటరమణ మూవీస్‌ బ్యానర్‌లో ప్రొడక్షన్‌ నం. 1గా కొలన్‌ వెంకటేశ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభం అయ్యింది.

ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ఈ నెల 16న మా సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. రాజమండ్రి, బెంగుళూరులో అధిక భాగం చిత్రీకరణ జరపనున్నాం. ఆగస్టు చివరి వారంలో షూటింగ్‌ పూర్తి అవుతుంది’’ అన్నారు. షాయాజి షిండే, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌ రెడ్డి, ‘సత్యం’ రాజేష్, పృథ్వీ, చంద్రమోహన్, సుధ, హేమ, శ్రీలక్ష్మీ, జయవాణి, తాగుబోతు రమేష్‌ ముఖ్య పాత్రల్లో నటించనున్న ఈ సినిమాకు సంగీతం: డి.జె. వసంత్, కెమెరా: సతీష్‌. జి, సహ నిర్మాత: సిరాజ్‌ వి. వెంకట్‌ రావు.

Advertisement
 
Advertisement
Advertisement