శ్రీమంతుడు కాంబినేషన్లో మరో సినిమా..? | Koratala siva Next with Mahesh | Sakshi
Sakshi News home page

శ్రీమంతుడు కాంబినేషన్లో మరో సినిమా..?

Jul 20 2016 11:17 AM | Updated on Sep 4 2017 5:29 AM

శ్రీమంతుడు కాంబినేషన్లో మరో సినిమా..?

శ్రీమంతుడు కాంబినేషన్లో మరో సినిమా..?

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సూపన్ హిట్ సినిమా శ్రీమంతుడు. మహేష్ కెరీర్లోనే బిగెస్ట్ హిట్గా నిలిచిన ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులన్నింటిని బద్దలు కొట్టింది. దీంతో మరోసారి...

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సూపన్ హిట్ సినిమా శ్రీమంతుడు. మహేష్ కెరీర్లోనే బిగెస్ట్ హిట్గా నిలిచిన ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులన్నింటిని బద్దలు కొట్టింది. దీంతో మరోసారి ఇదే కాంబినేషన్లో సినిమా ఉంటుందంటూ ప్రకటించారు మహేష్ బాబు, కొరటాల శివ. కానీ ఆ సినిమా ఎప్పుడు ఉంటుంది అన్న విషయం మాత్రం చెప్పలేదు.

అయితే బ్రహ్మోత్సవం సినిమాతో భారీ డిజాస్టర్ను చూసిన మహేష్, వీలైనంత త్వరగా మరోసారి కొరటాలతో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. అందుకే ప్రస్తుతం చేస్తున్న మురుగదాస్ సినిమా పూర్తవ్వగానే కొరటాల కాంబినేషన్లో సినిమాను పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు. కొరటాల శివ, డివివి దానయ్య బ్యానర్లో సినిమా చేయాల్సి ఉండటంతో ఆ సినిమాను మహేష్తోనే చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు.

ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా జనతా గ్యారేజ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. సమంత, నిత్యా మీనన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement