'మేము విడిపోతున్నాం' | Konkona Sensharma, Ranvir Shorey announce separation | Sakshi
Sakshi News home page

'మేము విడిపోతున్నాం'

Sep 14 2015 4:31 PM | Updated on Sep 3 2017 9:24 AM

'మేము విడిపోతున్నాం'

'మేము విడిపోతున్నాం'

బాలీవుడ్ నటి కొంకణా సేన్ శర్మ, నటుడు రణవీర్ షొరే దంపతులు విడిపోవాలని నిర్ణయించుకున్నారు.

ముంబై: బాలీవుడ్ నటి కొంకణా సేన్ శర్మ, నటుడు రణవీర్ షొరే దంపతులు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఐదేళ్ల తమ వైవాహిక జీవితానికి వీడ్కోలు పలికారు. ఈమేరకు తమ నిర్ణయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. వీరిద్దరూ విడిపోనున్నారని వచ్చిన రూమర్లు నిజమేనని రుజువు చేశారు.

'రణవీర్, నేను పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇకపై మేమిద్దరం స్నేహితులుగా కొనసాగుతాం. మా అబ్బాయికి కో-పేరెంట్ గా ఉంటాం. మా నిర్ణయాన్ని మీరు గౌరవిస్తారని ఆశిస్తున్నామ'ని కొంకణా సేన్ ట్వీట్ చేశారు. ఇదే విషయాన్ని రణవీర్ షొరే కూడా ట్విటర్ లో పోస్ట్ చేశారు.

2007 నుంచి ప్రేమించుకుంటున్న కొంకణ, రణవీర్ 2010లో పెళ్లి చేసుకున్నారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు హరూన్ ఉన్నారు.  కొంకణ, రణవీర్  కలిసి ట్రాఫిక్ సిగ్నల్, మిక్సిడ్ డబుల్స్, ఆజా నాచెలె, గౌర్ హరి దస్తాన్ సినిమాల్లో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement