కోలీవుడ్‌ కాలింగ్‌? | Kiara Advani Chance To Act In Chandramukhi 2 Movie | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌ కాలింగ్‌?

Jul 22 2020 3:26 AM | Updated on Jul 22 2020 3:26 AM

Kiara Advani Chance To Act In Chandramukhi 2 Movie - Sakshi

కోలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ హీరోయిన్‌ కియారా అద్వానీకి కబురొచ్చిందట. 2005లో వచ్చిన ‘చంద్రముఖి’ సీక్వెల్‌కి కియారాని కథానాయికగా అడిగారని సమాచారం. రజనీకాంత్‌ హీరోగా పి. వాసు దర్శకత్వంలో రూపొందిన ‘చంద్రముఖి’ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పి. వాసు సీక్వెల్‌ను ప్లాన్‌ చేస్తున్నారు. సన్‌పిక్చర్స్‌ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాలో నటుడు, కొరియోగ్రాఫర్, డైరెక్టర్, రాఘవా లారెన్స్‌ లీడ్‌ రోల్‌ చేస్తారు. హీరోయిన్‌గా కియారా అద్వానీని ఖరారు చేశారట. ‘లక్ష్మీబాంబ్‌’ (‘కాంచన’ హిందీ రీమేక్‌) చిత్రంతో లారెన్స్‌ దర్శకుడిగా బాలీవుడ్‌కి పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన ఈ సినిమాలో కియారాయే హీరోయిన్‌. ‘లక్ష్మీబాంబ్‌’ సినిమా జర్నీలో కియారా వర్క్‌ నచ్చిన లారెన్స్‌ ‘చంద్రముఖి 2’లో కూడా ఆమెనే హీరోయిన్‌ అయితే బాగుంటుందని అనుకున్నారట. మరి.. కోలీవుడ్‌లో కియారా జర్నీ ‘చంద్రముఖి 2’తో ప్రారంభం అవుతుందా? వెయిట్‌ అండ్‌ సీ.

Advertisement
 
Advertisement
Advertisement