హోటల్‌ కార్మికులతో కేరళ నటి వాగ్వాదం | Kerala Actress Fight With Hotel Management in Tamil Nadu | Sakshi
Sakshi News home page

హోటల్‌ కార్మికులతో కేరళ నటి వాగ్వాదం

Dec 21 2018 12:31 PM | Updated on Dec 21 2018 12:31 PM

Kerala Actress Fight With Hotel Management in Tamil Nadu - Sakshi

గొడవ కారణంగా ఏడుస్తున్న నటి మంజు సవేకర్‌

హోటల్‌ కార్మికులతో కేరళ నటి వాగ్వాదానికి దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది.

చెన్నై ,పెరంబూరు: హోటల్‌ కార్మికులతో కేరళ నటి వాగ్వాదానికి దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. వివరాలు చూస్తే ఒక మలయాళ చిత్రం నాగర్‌కోవిల్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది.

ఈ చిత్ర యూనిట్‌ నాగర్‌కోవిల్‌లోని ఒక హోటల్‌లో బస చేసి షూ టింగ్‌కు హాజరవుతున్నారు. కాగాబుధవారం అర్ధరాత్రి ఆ చిత్ర హీరోయిన్‌ మంజు సవేకర్‌ షూటిం గ్‌ ముగించుకుని హోటల్‌లోని తన గదికి వెళ్లగా గది క్లీన్‌ చేయకపోవడంతో ఆ హోటల్‌ కార్మికులపై వాగ్వాదానికి దిగింది. దీంతో ఈ వ్యవహారం గురించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి వచ్చిన పోలీసులు విచారణ జరిపి నటి మంజు సవేకర్‌కు, కార్మికులకు మధ్య గొడవను సర్ది చెప్పి సమస్యను పరిష్కరించారు.

Advertisement
 
Advertisement
Advertisement